Custard Apple
-
మధుర ఫలం
రాజానగరం: రుచిలో సిమ్లా యాపిల్ని మరపించే చాగల్నాడు కస్టర్డ్ యాపిల్ (సీతాఫలం)కి తూర్పు గోదావరి జిల్లాలోనే కాదు దేశ రాజధాని ఢిల్లీలో కూడా మంచి పేరు ఉంది. అయితే చాగల్నాడు ప్రాంతంలో రియలెస్టేట్ విస్తరిస్తున్న నేపథ్యంలో సీతాఫలాల తోటలు అంతరించిపోతున్నాయి. ఫలితంగా చాగల్నాడు సీతాఫలాలకు డిమాండ్ పెరిగి ధర కూడా పెరిగిపోయింది. చాగల్నాడు ప్రాంతంలో తోటలు (మామిడి, జీడిమామిడితో కలసి ఉంటాయి) తరిగిపోవడంతో సీతాఫలాల దిగుబడి అంతంత మాత్రంగానే ఉంటుంది. సీతాఫలాలు పక్వానికి రావాలంటే శీతలంతో పాటు వర్షాలు కురుస్తూ ఉండాలి. ఈ కారణంగానే ప్రస్తుతం ఈ ప్రాంతంలో అక్కడక్కడా లభిస్తున్న సీతాఫలాలతో ఏజెన్సీ ప్రాంతంలో విరివిగా దొరుకుతున్న సీతాఫలాలను జోడించి వ్యాపారులు స్థానికంగా విక్రయిస్తున్నారు. ఇక్కడ నుంచే జిల్లాలోని పలు ప్రాంతాలకు కూడా రవాణా అవుతున్నాయి. ఈ విధంగా సీజన్లో సీతాఫలాలు క్రయవిక్రయాల ద్వారా సుమారు రూ.7.5 కోట్ల వ్యాపార లావాదేవీలు జరుగుతాయని అంచనా. గుర్తించడం చాలా కష్టం రెండు దశాబ్దాల క్రితం జాతీయ రహదారి విస్తరణకు ముందు ఈ ప్రాంతంలో రోడ్లకు ఇరువైపులా సీతాఫలాల తోటలు విస్తారంగా ఉండేవి. రాత్రి సమయాల్లో బస్సుల్లో ప్రయాణించే వారికి లైటింగ్‌లో సీతాఫలాలు నిగనిగలాడుతూ కనిపించేవి. అంతేకాదు సీజన్లో దివాన్‌చెరువు కూడలి క్రయ, విక్రయదారులతో కిక్కిరిసిపోయేది. ఒక్కో సమయంలో ట్రాఫిక్ జామ్ కూడా జరుగుతూ ఉండేది. అయితే నేడు ఆ పరిస్థితులు లేవు. మార్కెట్లో ప్రస్తుతం లభిస్తున్న సీతాఫలాలు చాగల్నాడు ఫలాలో, ఏజెన్సీవో కూడా తెలియని పరిస్థితి. వీటి మధ్య ఉన్న తేడా స్థానికులకే మాత్రమే కొంత అవగాహన ఉంటుంది. దీంతో జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన స్టాల్స్ ద్వారా ప్రయాణికులు చాగల్నాడు ఫలాలుగానే భావించి కొనుగోలు చేసుకుని, తమ ప్రాంతాలకు తీసుకెళుతుంటారు. ఎందరికో ఉపాధి సీతాఫలాల ద్వారా సీజన్లో ఎందరికో జీవనోపాధి లభిస్తుంటుంది. రాజానగరం నుంచి రాజమహేంద్రవరం వరకు జాతీయ రహదారి వెంబడి విరివిగా వెలసిన దుకాణాలతో పాటు సైకిళ్ల పైన, తోపుడు బళ్లపైన జిల్లా అంతటా వీటి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రయాణికులు కొనుగోలు చేస్తున్నారు.చాగల్నాడు సీతాఫలాలు నిల్వకు ఆగవు. పక్వానికి వచ్చిన వెంటనే కళ్లు విచ్చుకున్నట్టుగా నిగనిగలాడుతూ కనిపిస్తాయి. అయితే ఏజెన్సీ సీతాఫలాలు వారం రోజుల వరకు నిల్వ ఉంటాయి. ఈ సీజన్లో సీతాఫలాల వ్యాపారం రూ.ఏడున్నర కోట్లు దాటుతుందని ఒక అంచనా. జాలై నుంచి అక్టోబరు వరకు ఏజెన్సీ సీతాఫలాలను దిగుమతి చేసుకుని, రూ.4.50 కోట్లకు పైబడి వ్యాపారం చేస్తుంటారు. ఇక తోటలు తగ్గినాగాని చాగల్నాడు సీతాఫలాల ద్వారా ఈ సీజన్లో (అక్టోబరు) రూ.రెండు కోట్ల వరకు వ్యాపార లావాదేవీలు జరుగుతాయని వ్యాపారులు అంటున్నారు. ఏ విధంగా చూసిన ఈ సీజన్లో సీతాఫలాల ద్వారా జిల్లాలో రూ.ఏడున్నర కోట్ల వరకు వ్యాపారం జరుగుతుందని అంచనా.వంద ఫలాలు రూ.2,500 పైమాటే.. తోటలు విస్తారంగా ఉన్న సమయంలో వంద సీతాఫలాలను రూ.50 నుంచి రూ.వందకు విక్రయించే వారు. కానీ నేడు ఆ ధరకు అడిగితే ఎగాదిగా చూస్తారు. ఎందుకంటే వందల లెక్కన కొనుగోలు చేసే రోజులు పోయాయి. మామిడి పండ్ల మాదిరిగా డజను, పాతిక, పరక చొప్పున కొనాల్సి వస్తుంది. గతంలో మాదిరిగా వంద ఫలాలు కొనాలంటే రూ.2500 పైనే ధర పలుకుతుంది. అంత మొత్తం పెట్టలేక చాలామంది డజన్ల లెక్కన కొనుగోలు చేస్తున్నారు. కాయల సైజులను బట్టి పరక, డజను లెక్కల్లో డజను రూ.300 నుండి రూ.500కు విక్రయిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతం నుంచి వీటిని కొంతమంది స్థానిక వ్యాపారులు హోల్‌సేల్‌గా తీసుకువచ్చి, జాతీయ రహదారి వెంబడి ఉన్న స్టాల్స్‌కి సరఫరా చేస్తుంటారు. అక్టోబర్ చివర్లో షోలాపూర్ ఫలాలు.. ఇదిలా ఉండగా దసరా ఉత్సవాల సమయంలో చాగల్నాడు సీతాఫలాలు అందుబాటులోకి వస్తాయి. అయితే తోటలు తక్కువగా ఉండటంతో అవి ఎప్పుడు వచ్చాయి. ఎప్పుడు అయిపోయాయనే విషయం కూడా తెలియకుండా జరిగి పోతుంటుంది. దీంతో ఈ సీజన్ ప్రారంభంతో ఏజెన్సీ సీతాఫలాలను చాగల్నాడు మార్కెట్‌కి వస్తే, ఆఖరులో (అక్టోబరు, నవంబరు) వ్యాపారులు షోలాపూర్ నుంచి కూడా సీతాఫలాలను దిగుమతి చేసుకుని తమ వ్యాపారాలు కొనసాగిస్తుంటారు.ఇవి చూడటానికి చాగల్నాడు సీతాఫలాల మాదిరిగానే నిగనిగలాడుతూ కనిపిస్తుంటాయి. దీంతో ఈ సీజన్లో షోలాపూర్ కాయల ద్వారా సుమారు రూ.కోటి వరకు వ్యాపార లావాదేవీలు జరుగుతాయని ఒక అంచనా. దివాన్‌చెరువు పండ్ల మార్కెట్‌కి షోలాపూర్ నుంచి వచ్చే యాపిల్, దానిమ్మల లోడులో వీటిని తీసుకువస్తుంటారు. సీజన్లో దొరికే ఫలాలను తినాలి సీజన్లో దొరికే ఫలాలను తినడం వలన అనేక ప్రయోజనాలు ఉంటాయి. ప్రకృతి మనకు సీజనల్‌గా వచ్చే వ్యాధుల నివారణకు ఫలాలను ప్రసాదిస్తుంది. ముఖ్యంగా ఈ సీజన్లో సీతాఫలాలను తీసుకోవడం వలన ఆరోగ్యపరంగా కూడా అనేక ప్రయోజనాలను పొందవచ్చు. అందుకనే వీటికి మార్కెట్లో డిమాండ్ ఉంటుంది. – అద్దంకి సీతారామమ్మ, అచ్యుతాపురం సీజనల్ పండ్లని నిర్లక్ష్యం చేయవద్దు నేటి ఆధునిక సమాజంలో అంతా రెడీమేడ్ ఫుడ్‌కు అలవాటు పడటం వలన జనం జబ్బుల బారిన పడుతున్నారు. ఆస్పత్రుల్లో చేరి, పండ్లు తిని నయం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి సీజనల్‌గా దొరికే పండ్లని ఒక్కసారైనా తింటే సీజనల్‌గా వచ్చే వ్యాధుల నుంచి కొంతమేర తప్పించుకోవచ్చు. – సత్తి త్రిమూర్తులు, ముక్కినాడపాకలు -
సీతాఫలం తరచూ తింటున్నారా? దీనిలోని గ్లైసెమిక్ ఇండెక్స్..
గుమ్మలక్ష్మీపురం: ఏజెన్సీలో సీతాఫలాల సీజన్ ప్రారంభమైంది. తియ్యని ఈ పండ్లలో ఎన్నో పోషక విలువలుండడమే కాకుండా కొన్ని రకాల అనారోగ్యాల నివారిణిగా పనిచేస్తుంది. ఈ పండే కాకుండా చెట్టు ఆకులు, బెరడు కూడా ఔషధ గుణాలను కలిగి ఉన్నాయని రస్తా కుంటుబాయి కృషి విజ్ఞాన కేంద్రం (ఆచార్యా ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం) గృహ విజ్ఞాన విభాగం శాస్త్రవేత్త వై.ఉమాజ్యోతి తెలిపారు. సీతాఫలం తీసుకుంటే కలిగే ఉపయోగాల గురించి ఆమె తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఎన్నో విటమిన్ల కలబోత సీతాఫలంలో ఎన్నో రకాల పోషకాలతో పాటు విటమిన్లు ఉన్నాయి. ఈ పండు తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. విటమిన్ (ఎ), విటమిన్ (బి) మెగ్నిషియం, పొటాషియం, ఫైబర్, ఐరన్ వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. ఉదయాన్నే తినడం ద్వారా కండరాలు, నరాల బలహీనత వంటి రుగ్మతలు తొలగిపోతాయి. శరీరానికి కావాల్సినంత శక్తి లభిస్తుంది. విటమిన్ (ఎ) పుష్కలంగా ఉండడంతో కంటి సమస్యలు దూరమవుతాయి. మెగ్నీషియం, పోటాషియం, సోడియం సమపాళ్లలో ఉండడం వల్ల రక్తపోటును అదుపు చేసి గుండె సమస్యలు తలెత్తకుండా చూస్తుంది. పేరుకుపోయిన అధిక కొవ్వును కరిగిస్తుంది. అల్సర్, గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. గర్భిణులు తినడం ద్వారా పుట్టబోయే బిడ్డల మెదడు చురుగ్గా ఉంటుంది. క్యాన్సర్ వంటి రోగాలు రాకుండా తోడ్పడుతుంది. బలహీనంగా ఉండే చిన్న పిల్లలకు సీతాఫలాలను ఎంత ఎక్కువగా తినిపిస్తే అంత మేలు. ఈ పండ్లను ఎక్కువగా తినడం ద్వారా రక్తహీనత తగ్గుతుంది. కడుపులో మంట, జీర్ణ సంబంధ సమస్యలున్న వారు ఈ పండ్లను ఎక్కువగా తినడం మంచిది. డైటింగ్ చేసేవారు ఈ పండ్లను క్రమం తప్పకుండా తీసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చు. ఎదుగుతున్న పిల్లలు నిత్యం తింటుంటే కాల్షియం లాంటి పోషకాలు అధికంగా లభిస్తాయి. దీంతో ఎముకలు దృఢంగా ఉంటాయి. శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలను బయటకు పంపడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. రక్తం శుధ్ధి అవుతుంది. గుండె ఆరోగ్యానికి మెరుగు సీతాఫలం చూడడానికి కూడా హృదయాకారంలో ఉంటుంది. శరీరమంతా రక్తప్రసరణ సరిగ్గా ఉండేలా చూస్తుంది. అందువల్ల రక్తహీనత దరి చేరదు. ఈ పండు తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్ లెవెల్స్ కూడా సరిగ్గా ఉంటాయి. సీతాఫలంలో గ్లైసెమిక్ ఇండెక్స్ 54, అంటే లో–గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. అందువల్ల డయాబెటిస్ ఉన్న వారు కూడా సీతాఫలం తినవచ్చు. అలాగే ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ మలబద్దకాన్ని అరికడుతుంది. ఉదర ఆరోగ్యానికి.. దీనిలో విటమిన్ సి సమృధ్ధిగా దొరుకుతుంది. ఆహారం తేలిగ్గా జీర్ణమయ్యేటందుకు దీనిలోని పీచుపదార్థం తోడ్పడుతుంది. అల్సర్లను నయం చేస్తుంది. ఎసిడిటీకీ చెక్ పెడుతుంది. డయేరియా లాంటి సమస్య రాకుండా అడ్డుకుంటుంది. చర్మ ఆరోగ్యానికి దోహదం ఈ పండులో స్మూత్ స్కిన్ టోన్ అందించే సూక్ష్మపోషకాలు ఉంటాయి. దీన్ని తినడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడి స్కిన్ మెరుస్తుంది. ఆకులతోనూ ప్రయోజనం ఒక్క పండేకాదు, సీతాఫలంచెట్టు ఆకులు కూడా ఉపయోగపడతాయి. ఆకుల్లోని హైడ్రోక్లోరిక్ ఆమ్లం చర్మ సంబంధ సమస్యల్ని తగ్గిస్తుంది. ఆకుల్ని మెత్తగా నూరి రాస్తే చర్మ వ్యాధులు తగ్గుతాయి. ఆకుల్ని మెత్తగా నూరి బోరిక్ పౌడర్ కలిపి మంచం, కుర్చీల మూలల్లో ఉంచితే నల్లుల బెడద ఉండదు. చెట్టు బెరడును కాచగా వచ్చిన కషాయాన్ని అధిక విరేచనాలతో బాధపడేవారికి ఔషధంగా ఇస్తుంటారు. సీతాఫలం గింజల్ని పొడిచేసి తలకు రాసుకుంటే పేల సమస్య ఉండదు. అయితే కళ్లల్లో పడకుండా చూసుకోవాలి. నేరుగా తినడమే మంచిది గర్భిణులు ఈ పండును సాధ్యమైనంత తక్కువగా తినాలి. పొరపాటున గింజలు లోపలికి వెళితే గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉంది. మోతాదుకు మించి తినకూడదు. మధుమేహ వ్యాధి గ్రస్తులు, ఊబకాయులు ఈ పండ్లను వైద్యుల సలహాలతో తీసుకోవాలి. జలుబు, దగ్గు, ఆయాసం, ఎలర్జీ సమస్యలతో బాధపడేవారు పరిమితంగా తీసుకోవడం మంచిది. ఈ ఫలాన్ని రసం రూపంలో కాకుండా నేరుగా తినడమే ఉత్తమం. ఎందుకంటే గుజ్జు నోటిలోపల జీర్ణరసాలను పెంచుతుంది. తద్వారా జీర్ణక్రియ వేగవంతమవుతుంది. పండుగుజ్జును తీసుకుని రసంలా చేసి పాలు కలిపి పిల్లలకు తాగిస్తే సత్వర శక్తి లభిస్తుంది. – వై.ఉమాజ్యోతి, శాస్త్రవేత్త, కేవీకే, రస్తాకుంటుబాయి -
సీతాఫలంపై మహాత్ముల బొమ్మలు
-
పంటపొలాల్లో సీతాఫలం సాగుచేస్తే మరింత ప్రయోజనం
-
సహజంగా పండే సీతాఫలాలు కూడా ప్రత్యేకంగా సాగు
-
ఒకేసారి అనేక రకాల పండ్ల తోటలు సాగు చేస్తూ అధిక లాభాలు..
-
Health: సీజనల్ ఫ్రూట్ సీతాఫలం.. తరచూ తింటున్నారా? ఇందులోని బయోయాక్టివ్ అణువుల వల్ల
Health Tips In Telugu: వినాయక చవితి నుంచి సంక్రాంతి వరకు విరివిగా లభించే సీజనల్ ఫ్రూట్స్‌లో సీతాఫలం ఒకటి. ఇందులో ఎన్నో పోషక విలువలు, విటమిన్లు, ఖనిజాలు ఉండటం వల్ల దీనిని పోషకాల ఘని అంటారు. సీతాఫలాలు చాలా రుచిగా ఉంటాయి కాబట్టి వీటిని ఇష్టపడని వారు దాదాపు ఉండరు. ఇవిగాక సీతాఫలం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలుసుకుందాం... ►సీతాఫలం అల్సర్లను నయం చేయడంలో, అసిడిటీని నివారించడంలో సహాయపడుతుంది. ►అంతేకాకుండా ఇందులో ఉండే సూక్ష్మపోషకాలు చర్మాన్ని మృదువుగా చేస్తాయి. ►ఇది కంటి చూపును, కురుల అందాన్ని, మెదడు పనితీరునూ మెరుగుపరుస్తుంది. ►సీతాఫలంలోని ఐరన్ కంటెంట్ ఐరన్ లోపాన్ని తగ్గించి, హిమోగ్లోబిన్‌ను మెరుగుపరిచి రక్తహీనతను నివారించగలదు. బయోయాక్టివ్ అణువుల వల్ల ►సీతాఫలంలోని బయోయాక్టివ్ అణువులు, యాంటీ ఒబెసియోజెనిక్, యాంటీ డయాబెటిస్, క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉంటాయి. ►సీతాఫలం గ్లైసెమిక్ ఇండెక్స్ 54, అంటే లో–గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. అందువల్ల డయాబెటిస్ ఉన్న వారు కూడా సీతాఫలం తినవచ్చు. ►అలాగే ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ మలబద్దకాన్ని అరికడుతుంది. అతి మాత్రం వద్దు ►ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియం హైబీపీని తగ్గిస్తుంది. ►సీతాఫలంలో ఫైబర్ ఎక్కువ ఎండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచిదే. ►అయితే, ఇది అధిక కేలరీలను కలిగి ఉంటుంది కనుక మోతాదుకి మించి తీసుకో కూడదు. నోట్: ఈ కథనం కేవలం ఆరోగ్యం గురించి అవగాహన కొరకు మాత్రమే! చదవండి: World Stroke Day: మెదడుకు ‘పోటు’.. బ్రెయిన్ స్ట్రోక్ నుంచి తప్పించుకోండి ఇలా.. Health Tips: నీరసం.. నిస్సత్తువా? వీటిని ఆహారంలో చేర్చుకున్నారంటే.. రాత్రిపూట పదే పదే మూత్ర విసర్జన: కెఫిన్, శీతల పానీయాలు.. ఇంకా వీటికి దూరంగా ఉండకపోతే -
18 ఎకరాలు: బత్తాయి, వరి, సీతాఫలం సాగు.. బియ్యం కిలో రూ. 80 చొప్పున! ఇంకా..
జీవనమే నిత్య పోరాటమైతే వ్యవసాయం అనుక్షణ యుద్ధమే అంటారు ఒంటరి మహిళా రైతు శశికళ. ఎం.ఎ., బీఈడీ చదివిన ఆమె భర్త ఆకస్మిక మృతితో ఉద్యోగాన్ని వదిలి వ్యవసాయం చేపట్టారు. 2005 నుంచి సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. ఆవులంటే ఇష్టంతో గోశాలను ఏర్పాటు చేసి వర్మీ కంపోస్టు, వర్మీ కల్చర్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. పచ్చదనాన్ని అమితంగా ఇష్టపడే ఆమె నర్సరీ ఏర్పాటు చేసుకొని లాండ్స్కేప్ కన్సల్టెంట్‌గా ఎదిగారు. క్షణం తీరిక లేకుండా పనుల్లో మునిగిపోయే శశికళ రైతుగా అనేక పురస్కారాలు అందుకున్నారు. ఇటు రైతుగా, అటు ఒంటరి మహిళగా దైనందిన జీవితంలో ఎదురయ్యే సమస్యలను వజ్రసంకల్పంతో ఎదుర్కొంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. 17 ఏళ్లుగా 18.5 ఎకరాల్లో మొక్కవోని దీక్షతో సమీకృత సేంద్రియ వ్యవసాయం కొనసాగిస్తున్న కర్ర శశికళ స్వగ్రామం (నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం) దుగ్గెపల్లి. సొంతంగా తయారు చేసుకున్న వర్మీ కల్చర్‌తో బత్తాయి తోటను చీడపీడల నుంచి కాపాడుకోగలగటం ఆమెను దృఢచిత్తంతో సేంద్రియ వ్యవసాయం వైపు తొలి అడుగులు వేయించాయి. సొంతంగా తయారు చేసుకునే వర్మీ కంపోస్టుకు అనేక జీవన ఎరువులు కలిపి తయారు చేసిన ‘వర్మీ కల్చర్’ను ప్రధానంగా శశికళ ఉపయోగిస్తున్నారు. దీనితోనే వరి, బత్తాయి, పశుగ్రాసం తదితర పంటలతో పాటు నర్సరీ మొక్కలను సాగు చేస్తున్నారు. వర్మీ కల్చర్‌ను ఇతర రైతులకూ విక్రయిస్తూ ఆదాయం గడిస్తున్నారు. – నాతి రమేష్, సాక్షి, త్రిపురారం, నల్లగొండ జిల్లా వరి.. రెండేళ్లకో పంట! తనకున్న వనరులను ప్రణాళికాబద్ధంగా ఉపయోగిస్తూ ముందడుగు వెయ్యటం శశికళ సేద్యం ప్రత్యేకత. సొంత భూమి 18.5 ఎకరాలకు గాను 6 ఎకరాల్లో బత్తాయి, 5 ఎకరాల్లో వరి పంట, 2 ఎకరాల్లో సీతాఫలం తోట సాగు చేస్తున్నారు. 2 ఎకరాల్లో దేశీ జాతుల గోశాలను ఏర్పాటు చేసి.. వర్మీ కల్చర్ ఉత్పత్తి చేస్తున్నారు. పుణేలో శిక్షణ పొంది 3.5 ఎకరాల్లో మూడేళ్లుగా నర్సరీని నిర్వహిస్తూ.. లాండ్స్కేప్ కన్సల్టెంట్‌గా ఎదుగుతున్నారు. అనుదినం 20 మంది మహిళా కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నారు. పండించిన ధాన్యాన్ని బియ్యం చేసి నేరుగా హైదరాబాద్ తదితర ప్రాంతాల్లోని పరిచయస్తులకు కిలో రూ. 80 చొప్పున అమ్ముతున్నారు. ఒక సీజన్లో పండించిన ధాన్యం నిల్వచేసి రెండేళ్లపాటు బియ్యం విక్రయిస్తుంటారు. రెండేళ్లకు ఒక సీజన్లో మాత్రమే వరి పండిస్తారు. ఉదా.. ప్రస్తుత వానాకాలంలో 5 ఎకరాల్లో 5204 సన్న రకం వరి పంటను సాగు చేస్తున్నారు. యాసంగిలో గానీ, వచ్చే ఏడాది రెండు సీజన్లలో గానీ వరి పండించరు. ఈ మూడు సీజన్లలో తమ ఆవుల కోసం పశుగ్రాసం పండిస్తారు. మార్కెట్ అవసరం మేరకు ఏ పంటైనా పండించటం ద్వారా మంచి ఆదాయం పొందవచ్చని శశికళ అనుభవపూర్వకంగా చెప్తున్నారు. వరి పంటకు దుక్కి దశలో ఓ సారి, చిరు పొట్ట దశలో మరోసారి వర్మీ కల్చర్‌ను వేస్తున్నారు. దీంతో పాటు ద్రవరూప ఎరువు వర్మీవాష్‌ను పైప్లైన్ల ద్వారా అందిస్తున్నారు. వర్మీ కల్చర్ ప్రొడక్ట్ ద్వారా పెట్టుబడి ఖర్చులు తగ్గడంతో పాటు ఆశించిన స్థాయిలో దిగుబడి వస్తున్నదన్నారు. 70 కిలోల ధాన్యం బస్తాలు ఎకరానికి 35 వరకు పండుతాయన్నారు. పూర్తిస్థాయి శ్రద్ధతో 3 దఫాలు వర్మీకల్చర్, 4 దఫాలు పంచగవ్య వాడటం ద్వారా శ్రీవరిలో ఎకరానికి 55 బస్తాల ధాన్యం దిగుబడి(2008లో) సాధించిన అనుభవం ఆమెది. ప్రస్తుతం నర్సరీ, లాండ్‌స్కేపింగ్ రంగంలోకి అడుగుపెట్టడం వల్ల వరి సాగుపై అంతగా శ్రద్ధ చూపలేకపోతున్నామన్నారు. 6 ఎకరాల్లో బత్తాయి మొక్కలు నాటి మూడేళ్లయ్యింది. ఏడాదికి రెండుసార్లు వర్మీకల్చర్, హ్యూమిక్ యాసిడ్‌ను వాడుతున్నారు. వచ్చే ఏడాది పంట కాపు వస్తుంది. 2 ఎకరాల్లో రెండేళ్ల క్రితం సీతాఫలం తోటను సాగు చేస్తున్నారు. ఏడాదికి రెండు సార్లు వర్మికల్చర్, హ్యూమిక్ యాసిడ్‌ను వాడుతున్నారు. కాపు మొదలవుతోంది. ఏటా 100 టన్నుల వర్మీ కల్చర్ 2 ఎకరాల్లో ఏర్పాటైన గోశాలలో 45 దేశీ జాతుల ఆవులు, 25 ఎద్దులు 7 లేగదూడలు ఉన్నాయి. పేడ, మూత్రం, చేపల చెరువు వ్యర్థ జలాలను వర్మీ కల్చర్ ఉత్పత్తికి వాడుతున్నారు. ఏడాదికి సుమారు 100 టన్నుల వర్మీ కల్చర్‌ను తయారు చేస్తున్నారు. వర్మీ కల్చర్‌ను స్వంత వ్యవసాయానికి వినయోగిస్తూ ఇతర రైతులకు కిలో రూ. 15 చొప్పున విక్రయిస్తూ ఆదాయం పొందుతున్నారు. 450 రకాల మొక్కల ఉత్పత్తి పుణే వెళ్లి 20 రోజులు శిక్షణ పొందిన తర్వాత శశికళ తన వ్యవసాయ క్షేత్రంలోనే 3.5 ఎకరాల్లో నర్సరీని ఏర్పాటు చేశారు. లాండ్‌స్కేపింగ్ కన్సల్టెంట్‌గా పనిచేస్తూ సమస్యలను అధిగమిస్తూ అభివృద్ధి సాధిస్తున్నారు. ఇన్డోర్, అవుట్ డోర్, బోన్సాయ్ మొక్కలు.. అంటుకట్టిన పండ్లు, పూల మొక్కలు సుమారు 450 రకాల మొక్కలు ఉన్నాయి. కొన్ని రకాల మొక్కలను పూణె, కోల్కత్తా, బెంగుళూరు నుంచి తెప్పిస్తున్నారు. నిమ్మ, నారింజ, ఉసిరి, బత్తాయి అంటు మొక్కలను, ఎవెన్యూ ప్లాంటేషన్‌కు వాడే రకరకాల మొక్కలను సొంతంగా ఉత్పత్తి చేస్తున్నారు. నర్సరీలో పెంచిన మొక్కలను స్థానికంగా ఉన్న గ్రామ పంచాయతీలు, మున్సిపల్ ఆఫీసులకు విక్రయిస్తున్నారు. ప్రైవేటు గృహాల్లో లాండ్‌స్కేపింగ్‌కు వినియో విక్రయిస్తూ శశికళ ఆదాయం పొందుతున్నారు. సేంద్రియ వ్యవసాయంలో నిలదొక్కుకోవడంతో పాటు నర్సరీ రైతుగా, లాండ్స్కేప్ నిపుణురాలిగా ఎదుగుతున్న శశికళ మహిళా రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. తీరికలేని పనంటే ఇష్టం..! తీరిక లేని పనిలో నిమగ్నం కావటం అంటే ఇష్టం. పరిగెట్టి సంపాయించాలని కాదు. స్వతంత్ర జీవనం పట్ల, పచ్చదనం పట్ల మనసులో ఉన్న ఇష్టం కొద్దీ నర్సరీ–లాండ్‌స్కేపింగ్ రంగంలోకి అడుగుపెట్టాను. కరోనా తర్వాత ఇప్పుడిప్పుడే ఈ రంగం పుంజుకుంటున్నది. అమ్ముడుపోకుండా మిగిలిన మొక్కలను పెద్ద (21 ఇంచ్‌ల) కవర్లలోకి మార్చి తర్వాత నెమ్మదిగా ఎక్కువ ధరకు అమ్ముతున్నాను. 20 మందికి పనికల్పించాను. వ్యవస్థ సజావుగా నడిచే అంత ఆదాయం అయితే వస్తోంది. వర్మీ కంపోస్ట్ తయారు చేసుకుంటూ సేంద్రియ వ్యవసాయం చేస్తున్నాను. సేంద్రియ వ్యవసాయంలో ఖర్చులు అదుపు చేసుకుంటేనే మంచి ఆదాయం వస్తుంది. ఒకే పంటపై ఆధారపడకుండా నర్సరీ ప్రారంభించాను. కష్టమైనా నష్టమైనా వ్యవసాయంలోనే నాకు సంతృప్తి. అమ్మానాన్న, బాబు సపోర్ట్ ఉండటంతో ఒంటరి మహిళనైనా పట్టుదలతో జీవన పోరాటం సాగిస్తున్నాను. పురుషులకు లేని సమస్యలు మహిళా రైతులను ఇంటాబయటా ఇబ్బంది పెడుతుంటాయి. తప్పదు. ఎదుర్కోవాల్సిందే! – కర్ర శశికళ (91824 43048), సేంద్రియ రైతు, లాండ్‌స్కేపింగ్ కన్సల్టెంట్, దుగ్గెపల్లి, త్రిపురారం మం., నల్లగొండ జిల్లా చదవండి: Bio Fence: వారెవ్వా.. అప్పుడు ఖర్చు 40 వేలు.. ఇప్పుడు 1500.. కోతుల బెడద లేదు! కాకర, చిక్కుడు.. అదనపు ఆదాయం కూడా.. ఎకరంలో కూరగాయల పందిరి సాగు.. ఏడాదికి లక్ష వరకు ఆదాయం! ఇక సోరకాయతో నెలలో 50 వేల వరకు.. -
నోరూరించే సీతాఫలాలు.. ఫుల్ డిమాండ్! 100 కాయల రేటు రూ.2500
చాగల్లు (తూర్పు గోదావరి): మండలంలోని ఊనగట్ల, అమ్ముగుంట, చిక్కాల, చిక్కాలపాలెం గ్రామాలు సీతా ఫలాలకు ప్రసిద్ధి. మెట్ట ప్రాంత గ్రామాల్లోని గరువు భూముల్లో రైతులు ఈ తోటలను విస్తారంగా పెంచుతారు. ఏటా అక్టోబర్‌లో కాపునకు కొచ్చే సీతాఫలాలను మండలంలోని అమ్ముగుంట, చిక్కాల కేంద్రాలుగా జిల్లాలోని ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు. రూ.కోట్లలో వ్యాపారం మండలంలో పండే సీతాఫలాలు రుచిగా ఉంటాయి. అందుకే డిమాండ్ కూడా ఎక్కువ. వీటిని కొనుగోలు చేయడానికి భీమవరం, తణుకు, విజయవాడ, ఏలూరు సహా పరిసర పట్టణ ప్రాంతాల నుంచి వ్యాపారస్తులు ఈ సీజన్లో రోజూ ఊనగట్ల, చిక్కాల వస్తారు. రైతులు తమ పొలాల్లో కాసిన సీతాఫలాలను మార్కెట్లకు తీసుకొచ్చి వారికి విక్రయిస్తారు.పెద్ద వ్యాపారులు రోజు రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల మేర లావాదేవీలు జరుపుతారు. ఇక చిల్లర వ్యాపారులు కూడా ఈ రెండు చోట్లా సీతాఫలాలను కొనుగోలు చేసి కొవ్వూరు, నిడదవోలు పరిసర గ్రామాల్లో విక్రయిస్తూ ఆదాయాన్ని ఆర్జిస్తారు. ఊనగట్ల శివారు అమ్మిగుంట సెంటర్లో సీతాఫలాల ఎగుమతి వర్షాల వల్ల ఈ ఏడాది సీతాఫలాల దిగుబడి ఆశాజనకంగానే ఉంది. వాతావరణ పరిస్థితులు కారణంగా కాయలన్నీ దాదాపు ఒకేసారి పక్వానికి రావడంతో వాటిని ఒబ్బిడి చేసుకోలేక రైతులు ఇబ్బందులు పడ్డారు. కొంత మేర కాయలు వర్షానికి దెబ్బతిన్నాయని పలువురు రైతులు తెలిపారు. అయితే ఏటా ఈ పరిస్థితి ఉండదని చెబుతున్నారు. వంద సీతాఫలాలను రైతుల వద్ద నుంచి రూ.2,000 నుంచి రూ.2,500 రేటుకు కొనుగోలు చేస్తున్నారు. వ్యాపారులు రిటైల్‌గా రూ.3,000 నుంచి రూ.4,000 రేటుకు అవకాశాన్ని బట్టి, కాయల సైజును బట్టి విక్రయిస్తున్నారు. రెండు వేల ఎకరాల్లో తోటలు ఈ ఏడాది సీతాఫలాల ధరలు ఆశాజనకంగా ఉండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చాగల్లు మండలంలోని సుమారు రెండు వేల ఎకరాల విస్తీర్ణంలో సీతాఫలాల తోటలు ఉన్నాయని రైతులు చెబుతున్నారు. రైతులు తమ పొలాల్లో పండిన కాయలను కోసి సైకిళ్లు, మోటారు సైకిళ్లపై తీసుకొచ్చి వ్యాపారులకు విక్రయిస్తారు. వ్యాపారస్తులు తాము కొనుగోలు చేసిన కాయలను మినీ వ్యాన్లపై పట్టణాలకు తరలించి అక్కడ అమ్ముకుంటారు. అవగాహన కల్పించాలి సీతాఫలాల తోటల పెంపకంపై ఉద్యాన శాఖాధికారులు రైతులకు ఆవగాహన కల్పించాలి. ఈ ఏడాది సీతాఫలాలు కాపు బాగానే ఉంది. వాతవరణ పరిస్థితులు వలన కాయలు అధిక స్థాయిలో ఒకేసారి పక్వానికి రావడంతో రైతులు కొంతమేర ఇబ్బందులు పడ్డారు. – మిక్కిలి నాగేశ్వరరావు, రైతు, చిక్కాల అధిక ధరలకు విక్రయాలు ఈ సారి సీతాఫలాలు దిగుబడి తగ్గడంతో మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఇక్కడి కాయలు వివిధ పట్టణాలకు ఎగుమతి అవుతున్నాయి. రైతులకు అంతగా లాభాలు రాకపోయినా వ్యాపారులకు ప్రయోజనకరంగానే ఉంది. – సంసాని రమేష్, చిక్కాల -
Health Tips: షుగర్ పేషెంట్లకు ఈ పండ్లు అస్సలు మంచివి కావు! వీటిని తింటే..
సాధారణంగా పండ్లు ఎవరికైనా మంచిదే. ఎందుకంటే పండ్లలో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నోరకాల పోషకాలుంటాయి. అందుకే వీటిని ఎక్కువగా తినాలని ఆరోగ్య నిపుణులు, డాక్టర్లు సలహానిస్తుంటారు. కానీ మధుమేహుల ఆరోగ్యానికి కొన్నిరకాల పండ్లు బొత్తిగా మంచివి కావు. ముఖ్యంగా చక్కెర శాతం ఎక్కువగా ఉండేవి. వీటికి దూరంగా ఉండండి! ఈ పండ్లు మధుమేహుల రక్తంలో చక్కెర స్థాయులను పెంచుతాయి. పైనాపిల్, సీతాఫలం, అరటి, సపోటా, మామిడి పండ్లలో అధికమొత్తంలో చక్కెర ఉంటుంది కాబట్టి వీటికి దూరంగా ఉండటం మంచిది. ఇవి దోరగా ఉన్నపుడు తినొచ్చు! జామ, బొప్పాయి, అరటి వంటి వాటిని బాగా పండినవాటికంటే దోరగా ఉన్నవి మంచిది. ఇవి ఎలా తిన్నా ఓకే! నేరేడు పళ్లు, కివీ పండ్లు ఎలా తిన్నా చెరుపు చేయవు. అయితే తక్కువ పరిమాణంలో తీసుకోవడం మంచిది. అలాగే క్యారట్, బీట్రూట్లలోనూ, ఇతర దుంప కూరలలోనూ బీట్రూట్తో పోల్చితే మధుమేహులకు క్యారట్లే మంచిదని ఆరోగ్య నిపుణుల అభిప్రాయం. చదవండి: Health Tips: బోడ కాకర తరచుగా తింటున్నారా? దీనిలోని లుటీన్ వల్ల.. Health Tips: బీపీ పెరగడానికి కారణాలేంటి? ఎలా కంట్రోల్ చేసుకోవాలి? -
సీతా ఫలంతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?
రాయదుర్గం(అనంతపురం జిల్లా): ఎరువులు వేయాల్సిన పనిలేదు. సాధారణ పంటల్లా నీరు కట్టాల్సిన అవసరం లేదు. రేయింబవళ్లూ కాపలా ఉండాల్సిన అవసరం అంత కంటే ఉండదు. కేవలం సహజసిద్ధంగా, కొంత వర్షం వచ్చిందంటే వాటంతట అవే కాసేస్తాయి. పేదోళ్లకు ఉన్నంతలో పోషకాలందించడమే కాకుండా జీవనోపాధిని కూడా కల్పిస్తున్నాయా పండ్లు. ఇంతటి ప్రఖ్యాతి గాంచిన ఫలరాజసాలు సీతాఫలాలు. చదవండి: ఏపీలో మరో భారీ సంక్షేమ పథకం.. అక్టోబర్ 1 నుంచి అమలు అదనులో వర్షాలు కురవడం.. కొండ ప్రాంతాలన్నీ నందనవనాలను తలపించడం వెరసి సీతాఫలాలు విరగ్గాశాయి. కాయలు పక్వానికి రావడంతో కోతలు మొదలు పెట్టిన వ్యాపారులు మార్కెట్లో గంపలను నింపేశారు. అనంతపురం జిల్లా గుమ్మఘట్ట మండలం నల్లకొండ, బోడిగుట్ట, అడిగుప్ప కొండలతో పాటు పైతోట, చెరువుదొడ్డి, సిరిగేదొడ్డి, రాయదుర్గం తదితర ప్రాంతాల్లో ఈ కాయలు ఎక్కువగా లభిస్తాయి. మాంసకృతులు, ఖనిజ లవణాలు, విటమిన్లు పుష్కలంగా లభిస్తుండడంతో సీతాఫలాలకు గిరాకీ తగ్గడం లేదు. గంపలో 200 కాయలు చిన్నవిగా ఉంటే రూ.200– 250, కాస్త సైజు ఉంటే రూ.300లు, 30 కేజీలు పట్టే బాక్సయితే రూ.600–700 వరకు విక్రయిస్తున్నారు. యాపిల్‌లో ఉండే పోషకాలకు దీటుగా లభ్యం కావడంతో ఈ పేదోడి యాపిల్ సీజన్ నవంబర్ చివరి కంతా పూర్తి కానుంది. సీతాఫలం ప్రాముఖ్యతే వేరు.. అరటి, బొప్పాయి, ద్రాక్ష, అంజూర, జామ, దానిమ్మ, యాపిల్, సపోట, మామిడి లాంటి పండ్ల ఉత్పత్తికి ఎన్నో రకాల క్రిమి సంహారక మందులు వాడుతుంటారు. రసాయనిక ఎరువులు కూడా వినియోగిస్తారు. పండ్లు కోతకొచ్చాక మాగేందుకు సైతం రసాయనాలు చల్లుతారు. ఇలాంటివి తింటే ఆరోగ్యానికి హానికరం. అయితే ప్రకృతిసిద్ధంగా పండిన సీతాఫలాలు రసాయన రహితంగా ఉండి చక్కటి ఆరోగ్యాన్నిస్తాయి. పది వేల ఎకరాల్లో విస్తరించిన చెట్లు.. రాయదుర్గం పరిసరాల్లో కొండలు, గుట్టలు అధికంగా ఉండడంతో సీతాఫలం చెట్లు పది వేల ఎకరాలకు పైగా విస్తరించాయి. గుమ్మఘట్ట మండలంలో అత్యధికంగా ఈ చెట్లు ఉన్నాయి. ఈ ప్రాంతంలో సీతాఫలాల అమ్మకాలపై ఆధారపడి సుమారు 650 కుటుంబాల వారు జీవనోపాధి పొందుతున్నారు. వర్షాకాలం మొదలైందంటేæ చాలు ఇంటిల్లిపాదీ ఈ పనిలోనే నిమగ్నమైపోతారు. చెట్లలో కాయలు పక్వానికి వచ్చాయని తెలియగానే వేకువ జామునే కొండ ఎక్కడం.. కాయలు కోయడం.. వెంటనే మార్కెట్‌కు తరలించడం చేస్తారు. 100 గ్రాముల సీతాఫలంలో లభ్యమయ్యే పోషకాలు.. ♦చక్కెర శాతం 19 నుంచి 29 గ్రాముల వరకు ♦23.05 గ్రాముల కార్బోహైడ్రేట్లు ♦104 కిలోల కేలరీల శక్తి ♦3.1 గ్రాముల ఫైబర్ ♦1.6 గ్రాముల ప్రొటీన్లు ♦17 మిల్లీ గ్రాముల క్యాల్షియం. ♦0.4 గ్రాముల కొవ్వుపదార్ధాలు ♦4.37 గ్రాముల ఫాస్పర్ ♦ 4.37 మిల్లీ గ్రాముల ఐరన్ ♦37 మిల్లీ గ్రాముల సీ–విటమిన్ పండ్లే జీవనాధానం 20 ఏళ్లుగా సీతాఫలాల వ్యాపారం చేస్తున్నా. సీజన్లో ఈ పండ్లే మాకు జీవనాధారం. సాయంత్రమే కొండమీద నుంచి కాయలు ఇంటికి తెచ్చుకుంటాం. ఉదయమే మార్కెట్‌కు తీసుకొస్తాం. కాయల సైజు బాగుండడంతో మధ్యాహ్నానికంతా అమ్ముకుని రూ.వెయ్యి సంపాదనతో ఇంటికి చేరుకుంటున్నా. –ముద్దమ్మ, సీతాఫలం వ్యాపారి,చెరువుదొడ్డి కర్ణాటక నుంచీ వస్తున్నారు రాయదుర్గం సీతాఫలాలు ఎంతో ప్రఖ్యాతిగాంచాయి. బళ్లారి, బెంగళూరు, చెళ్లకెర, చిత్రదుర్గం నుంచి చాలా మంది వ్యాపారులు కొనుగోలు చేసి తీసుకెళుతున్నారు. నల్లకొండ నుంచి ఎక్కువగా కాయలు తీసుకొచ్చి అమ్మకం చేపడతా. వర్షం సక్రమంగా కురిస్తే చాలు పంట చేతికందుతుంది. పైసా పెట్టుబడి కూడా అవసరం లేదు. ఈ పండ్లను షుగర్ ఉన్న వారు కూడా తింటే ఏమీ కాదని వైద్యులే చెబుతున్నారు. – బంజోబయ్య, సీతాఫలం వ్యాపారి, బంజయ్యనగర్ వర్షాలకు చెట్లు ఏపుగా పెరిగాయి సీతాఫలాల చెట్లు వందల కుటుంబాలకు జీవనాధారమయ్యాయి. ఇవి మూడేళ్లుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఏపుగా పెరిగాయి. అంతకు ముందు సరైన వానలు లేక దిగుబడుల మాట అటుంచితే చెట్లన్నీ ఎండిపోయి కొండలు కళావిహీనంగా కనిపించేవి. ఇప్పుడు మాత్రం కళకళలాడుతున్నాయి. ఈసారి మంచి దిగుబడినిచ్చాయి. – కుళ్లాయిస్వామి, కామయ్యతొట, రాయదుర్గం -
సిరులు కురిపిస్తున్న సీతాఫలం.. బరువు తగ్గాలనుకునేవారు ఈ పండు తింటే..
సాక్షి, పార్వతీపురం జిల్లా: సీతాఫలాల సాగుకు పార్వతీపురం మన్యం జిల్లా పెట్టిందిపేరు. ఇక్కడి కొండ ప్రాంతాల్లో వంద శాతం సేంద్రియ పద్ధతిలోనే గిరిజనులు సీతాఫలాల తోటలను సాగుచేస్తున్నారు. వీటి నుంచి వచ్చే దిగుబడులు నాణ్యమైనవి కావడం, రుచిగా ఉండడంతో కొనుగోలుకు అధికమంది ఆసక్తిచూపుతున్నారు. అందుకే మన్యం సీతాఫలాలకు మార్కెట్లో గిరాకీ ఉంది. ఇతర జిల్లాలకు చెందిన వ్యాపారులు వచ్చి ఇక్కడి పంటను కొనుగోలు చేస్తున్నారు. రాష్ట్రంలో పార్వతీపురంమన్యం, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని ఏజెన్సీలో సీతాఫలం పంట సాగవుతోంది. ఏటా వర్షాకాలంలో ఆరంభమై శీతాకాలం ముగిసేవరకు సీతాఫలం సీజన్ కొనసాగుతుంది. ఈ ఏడాది ఆగస్టు మొదటి వారంలోనే పంట చేతికి రావడంతో గిరిజనరైతులు సంబరపడుతున్నారు. దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయని చెబుతున్నారు. నాణ్యమైన దిగుబడులు... దశాబ్దాల కాలంగా పార్వతీపురం మన్యం జిల్లాలోని సీతంపేట, సాలూరు, మక్కువ, జి.ఎల్.పురం, జియ్యమ్మవలస, కురుపాం, పాచిపెంటలోని కొండ ప్రాంతంలో సుమారు 5 వేల ఎకరాల్లో సీతాఫలం పంట సాగువుతోంది. శతశాతం సేంద్రియ పద్ధతిలోనే పంట సాగుచేస్తున్నారు. ఎటువంటి ఎరువులు, పురుగు మందులు వినియోగించకుండానే వాతావరణ ప్రభావంతో పంట పక్వానికి వస్తుంది. అందుకే రుచిగా ఉంటాయి. ఏటా వంద కోట్ల వ్యాపారం... మన్యంలో ఏటా వాతావరణం అనుకూలిస్తే ఎకరాకు 8 టన్నుల దిగుబడి వస్తుందన్నది గిరిజన రైతుల లెక్క. కిలో రూ.15 నుంచి రూ.25లకు గిరిజనుల వద్ద వ్యాపారాలు కొనుగోలు చేసి గ్రేడ్లుగా విభజిస్తారు. తర్వాత సాధారణ రకాన్ని మార్కెట్లో రూ.40 నుంచి రూ.50కు, గ్రేడ్–1 రకం రూ.70 నుంచి రూ.80లకు అమ్ముతున్నారు. ఏటా సుమారు రూ.100 కోట్ల వరకు సీతాఫలం వ్యాపారం సాగుతున్నట్టు అంచనా. రైతుల కంటే వ్యాపారులకే అధిక ఆదాయం సమకూరుతోంది. చదవండి: Health: ప్లేట్లెట్ల సంఖ్య పడిపోయిందా? బొప్పాయితో ఒక్కటే కాదు గుమ్మడి, గోధుమ గడ్డి.. సీతాఫలంతో ప్రయోజనాలెన్నో.. ►సీతాఫలాల్లో మానవ శరీరానికి ఉపయోగపడే అనేక పోషకాలు లభిస్తాయి. ఇందులో విటమిన్ ఏ,బి–6, సీ, మెగ్నీషియం, కాపర్, పొటాషియం, ఐరన్లు ఉంటాయి. కండరాల వృద్ధికి దోహదపడతాయి. నరాల బలహీనతతో బాధపడే వారు ఈ పండ్లను తినడం మంచిదని వైద్యనిపుణులు చెబుతున్నారు. ► సీతాఫలాన్ని, తేనెను తగినమోతాదులో తీసుకోవడం వల్ల ఆరోగ్యవంతమైన బరువు సొంతమవుతుంది. ఇందులో ఉండే మెగ్నీషియం కండరాలకు శక్తిని ఇస్తుంది. ► బరువు తగ్గాలి అనుకునేవారికి సీతాఫలం చక్కని ఔషధం. శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను బయటకు పంపి, ఊబకాయం, అధిక బరువు సమస్యలకు చెక్ పెడుతుంది. కడుపులో ఉండే బిడ్డకు రోగనిరోధకశక్తిని పెంచుతుంది. శిశువు మెదడు, నాడీ వ్యవస్థ మెరుగవుతుంది. తల్లిలో పాలవృద్ధికి దోహదపడుతుంది. ►మలబద్దకంతో బాధపడేవారు సీతాఫలాలు తినడం మంచిది. ఇందులో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. సీతాఫలం జ్యూస్‌గా లేదా నేరుగా తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. అల్సర్, గ్యాస్, ఎసిడిటీ వంటి ఉదర సమస్యలను నివారిస్తుంది. ఆరోగ్యానికి మంచిది సీతాఫలంలో విటమిన్–ఎ అధికంగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల సహజంగా మీ చర్మం కాంతివంతమవుతుంది. విటమిన్–ఎ మీ దృష్టి లోపాలను కూడా సవరించి చురుకైన కంటిచూపును ఇస్తుంది. రక్తహీనత సమస్యలను దూరం చేస్తుంది. రక్తశుద్ధికి తోడ్పడుతుంది. – డాక్టర్ జి.ప్రదీప్‌కుమార్, మెడికల్ ఆఫీసర్, వీరఘట్టం మార్కెట్ సదుపాయం కల్పిస్తా.. మన్యం జిల్లాలో పండే సీతాఫలాలకు మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. అయితే, గిరిజనులకు ఆ ధరలు దక్కడం లేదు. వ్యాపారులు చౌకగా పంటను కొనుగోలు చేసి మైదాన ప్రాంతాల్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. సీతాఫలాలకు జీసీసీ ద్వారా మార్కెట్ సదుపాయం కల్పించేందుకు కృషిచేస్తా. – విశ్వసరాయి కళావతి, ఎమ్మెల్యే, పాలకొండ ఎగుమతి చేసేందుకు చర్యలు మన్యం సీతాఫలాలు భలే రుచిగా ఉంటాయి. ఇటువంటి ఫలాలు దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు ఎగుమతి చేసేందుకు చర్యలు తీసుకుంటాం. మార్కెట్ సదుపాయం కోసం సాధ్యాసాధ్యాలపై ప్రభుత్వంతో మాట్లాడి సీతాఫలంకు మార్కెట్ సదుపాం కల్పిస్తాం. – బి.నవ్య, సీతంపేట ఐటీడీఏ పీఓ -
Custard Apple: ప్రాణం తీసిన సీతాఫలం
సాక్షి, దుగ్గొండి (వరంగల్): వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం స్వామిరావుపల్లిలో ఆదివారం సీతాఫలాల కోసం వెళ్లి బాలుడు మృత్యువాత పడ్డాడు. గ్రామానికి చెందిన జమలాపురం శ్రీనివాస్– మమత దంపతుల కుమారుడు సన్ని(9) ఆదివారం పాఠశాలకు సెలవు కావడంతో ఇంటి సమీపంలోని జమలాపురం చిన్న సాంబయ్య ఇంటి ప్రహరీ పక్కనే ఉన్న సీతాఫలం చెట్టుపై పండ్లు కోయడానికి గోడ ఎక్కాడు, కాయలు కోస్తుండగా ప్రమాదవశాత్తు గోడకూలి పెల్లలు సన్నిపై పడ్డాయి. దీంతో తీవ్రగాయాలైన సన్ని అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహం వద్ద బాలుడి తల్లిదండ్రులు శ్రీనివాస్–మమత రోదనలు కంటతడిపెడుతున్నాయి. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై లక్ష్మారెడ్డి తెలిపారు. చదవండి: Hyderabad: పూల కుండీల్లో గంజాయి మొక్కలు -
Quick Sweet Recipes: నోరూరించే కిస్మిస్ లడ్డూ, కస్టర్డ్ ఆపిల్ హల్వా తయారీ ఇలా..
స్వీట్లు చూస్తే ఆగలే.. బజార్లో దొరికే స్వీట్లలో నాణ్యతలేని పదార్థాలు కలుపుతారు.. తింటే ఆరోగ్య సమస్యలు. ఇంట్లోనే మీకిష్టమైన స్వీట్లు తయారు చేస్తే.. కిస్మిస్ లడ్డూ, కస్టర్డ్ ఆపిల్ హల్వా తయారీ విధానం మీకోసం.. కిస్మిస్ లడ్డూ కావలసిన పదార్థాలు: ►కిస్మిస్ పేస్ట్ – 1కప్పు (మిక్సీ పట్టుకోవాలి) ►కొబ్బరి పాలు, తేనె, పీనట్ బటర్ – 4 టేబుల్ స్పూన్ల చొప్పున ►ఓట్స్ – పావు కప్పు ( వేయించి పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి) ►బాదం పౌడర్ – 2 టేబుల్ స్పూన్లు ►నెయ్యి – ఉండ చేసేందుకు చేతులకు ►కొబ్బరి తురుము – కొద్దిగా (అభిరుచిని బట్టి) తయారీ విధానం ముందుగా ఒక బౌల్లో ఓట్స్ పౌడర్, కొబ్బరిపాలు, తేనె, పీనట్ బటర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. అందులో బాదం పౌడర్, కిస్మిస్ పేస్ట్ కూడా వేసుకుని ముద్దలా కలుపుకుని, చేతులకు నెయ్యి రాసుకుని చిన్న చిన్న లడ్డూల్లా చేసుకోవాలి. అనంతరం కొబ్బరి తురుములో ఈ లడ్డూలను దొర్లిస్తే సరిపోతుంది. కస్టర్డ్ ఆపిల్ హల్వా కావలసిన పదార్థాలు: ►సీతాఫలం (కస్టర్డ్ ఆపిల్) – 1 కప్పు (బాగా మగ్గిన సీతాఫలాలను పైతొక్క తొలగించి, వడకట్టే తొట్టెలో వేసుకుని, దాని కింద గిన్నె పెట్టుకుని, చేత్తో నలిపి గింజలన్నీ ►తొలగించి గుజ్జు తీసుకోవాలి) ►నెయ్యి, సుజీ రవ్వ – అర కప్పు చొప్పున ►పంచదార – పావు కప్పు, చిక్కటి పాలు – 1 కప్పు ►జాజికాయ పొడి – పావు టీ స్పూన్ ►కిస్మిస్, జీడిపప్పు, బాదం ముక్కలు – ►అర టేబుల్ స్పూన్ చొప్పున (నేతిలో వేయించి పక్కనపెట్టుకోవాలి) తయారీ విధానం ముందుగా కళాయిలో నెయ్యి వేసుకుని.. అందులో రవ్వ వేసి తిప్పుతూ ఉండాలి. తర్వాత పంచదార, పాలు పోసుకుని దగ్గర పడే వరకూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అనంతరం సీతాఫలాల గుజ్జు, జాజికాయ పొడి, నేతిలో వేయించిన కిస్మిస్, జీడిపప్పు, బాదం ముక్కలూ వేసి తిప్పుతూ దగ్గర పడగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చదవండి: ఘుమ ఘుమలాడే పనీర్ సమోసా, మరమరాల వడ తయారీ.. -
స్వీటాఫలం
ఇటీవల మార్కెట్లోకి సీతాఫలాలు విరివిగా వస్తున్నాయి. ఎంతో తియ్యగా ఈ పండుతో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎన్నెన్నో. అసలే చలి సీజన్లో ఈ పండు తింటే మరింత ఎక్కువగా జలుబు చేస్తుందని కొందరు ఈ పండును తినడానికి పెద్దగా ఇష్టపడరు. కానీ వేసవిలో దొరికే మామిడి వేడిచేస్తుందన్నా, శీతకాలంలో దొరికే సీతాఫలాలు జలుబు చేస్తాయన్నా... ఏ సీజన్లో దొరికే పండ్లను ఆ సీజన్లో తినాల్సిందే. సీతాఫలంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుంటే ‘జలుబూ–గిలుబూ జాన్తానై’ అంటూ ఆ అపోహలన్నీ పక్కనబెట్టి తప్పక తినేస్తారు. సీతాఫలంతో మనకు సమకూరే ప్రయోజనాల్లో ఇవి కొన్ని మాత్రమే. ►సీతాఫలంలో అనేక రకాల యాంటీఆక్సిడెంట్స్, విటమిన్–సి వంటివి కలిసి శరీరానికి రోగనిరోధక శక్తిని ఇస్తాయి. ఫలితంగా ఈ పండు ఎన్నో రకాల జబ్బులను నివారిస్తుంది. సీతాఫలంలోని యాంటీ ఆక్సిడెంట్స్ కారణంగా అది ఎన్నో రకాల క్యాన్సర్లను నివారిస్తుంది. ►సీతాఫలంలో పొటాషియమ్ చాలా ఎక్కువ. అందుకే... అధిక రక్తపోటు (హైబీపీ) ఉన్నవారు ఈ పండును తింటే... రక్తపోటును అదుపులో ఉంటుంది. ►రక్తహీనత ఉన్నవారికి సీతాఫలం చాలా మంచిది. ఇందులో ఐరన్, కాపర్ పుష్కలంగా ఉంటాయి. అవి రక్తహీనత (అనిమియా)ను సమర్థంగా అరికడతాయి. ►సీతాఫలాల్లోని విటమిన్–ఏ వల్ల జుట్టు ఆరోగ్యకరంగా మెరుస్తూ ఉండటంతో పాటు, మేనికి మంచి నిగారింపు వస్తుంది. ఇలా జుట్టు బాగా పెరగడానికి సీతాఫలంలోని ఐరన్ ఉపకరిస్తుంది. ►సీతాఫలంలో పీచు చాలా ఎక్కువ. ఈ పీచుతో పాటు ఇందులోని కాపర్ కలిసి మలబద్దకం వంటి సమస్యను నివారిస్తాయి. ఈ పండులోని పీచు పదార్థాలు జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేసేలా చూస్తాయి. ►ఇందులో ఉండే మెగ్నీషియమ్ రక్తప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. ఫలితంగా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ►సీతాఫలం కీళ్లవాతాన్ని (రుమాటిజమ్)నూ, ఆర్థరైటిస్ వంటి ఎముకల సమస్యలనూ నివారిస్తుంది. ►ఈ పండు కండరాల బలహీనతను తగ్గిస్తుంది. చురుగ్గా ఉంచుతుంది. ►సీతాఫలం డిప్రెషన్‌ను తగ్గిస్తుంది. -
వేప చెట్టుకు సీతాఫలం!
మహబూబ్‌నగర్ రూరల్: ఓ వేప చెట్టుకు సీతాఫలం కాసింది. మహబూబ్ నగర్ రూరల్ మండలం ఫతేపూర్‌లో సోమవారం ఈ ఘటన వెలుగు చూసింది. గ్రామ పంచాయతీ కార్యాలయం వెనుక భాగంలో ఉన్న వేప చెట్టుకు సీతాఫలం కాయ కాసింది. దీన్ని గ్రామస్తులు ఆసక్తిగా తిలకించారు. -
సీతాఫలం ఉపాధి మార్గం
జగదేవ్‌పూర్: తెల్లవారంగానే చంకన తట్టబుట్ట, సంచి పట్టుకుని అడవికి ప్రయాణం..చెట్టు పుట్ట తిరుగుతూ సీతాఫలాల కోసం ఆరాటం..సేకరించిన కాయలను తట్టలో పెట్టుకుని అమ్మేందుకు పోటీ..ఇదంతా కూలీల బతుకు పోరాటం..వాన కాలం చివరి దశలో ఏ పల్లెలో చూసినా సీతాఫలాల కోసం కూలీలు ఊరు విడిచి వెళుతూ కనిపిస్తారు. మండలంలోని సీతాఫలాల అమ్మకాలు జోరందుకున్నాయి. వందలాది మంది కూలీలు సీతాఫలాలతో ఉపాధి పొందుతున్నారు. జగదేవ్‌పూర్ మండలం అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉండడంతో ప్రతి ఏటా సీతాఫలాలతో ఎంతో మంది కూలీలు ఉపాధి పొందుతున్నారు. మండలంలోని ధర్మారం, కొండాపూర్, పీర్లపల్లి, దౌలాపూర్ తదితర గ్రామాల్లో వందలాది ఎకరాలు అటవీ ప్రాంతం ఉంది. జిల్లా సరిహద్దు మండలం కావడంతో నల్గొండ, వరంగల్ జిల్లాలో కొన్ని గ్రామాల్లో అటవీప్రాంతం ఉంది. గంధమల్ల, నర్సాపూర్, సాల్వపూర్, సింగారం తదితర గ్రామాల్లో కూలీలు సీతాఫలాలను సేకరిస్తారు. సేకరించిన కాయలను తట్ట చొప్పున విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నారు. ఒక్క తట్ట వంద రూపాయల నుంచి రెండు వందల వరకు అమ్ముతున్నారు. సేకరించిన సీతాఫలాలను ప్రధాన రోడ్ల వెంట విక్రయిస్తున్నారు. జగదేవ్‌పూర్, పీర్లపల్లి ప్రధాన రోడ్ల వెంట ఎంతో మంది కూలీలు సీతాఫలాలతో కనిపిస్తారు. ముఖ్యంగా ముదిరాజ్ కులస్తులు ఎక్కువగా సీతాఫలాలతో ఉపాధి పొందుతున్నారు. ప్రతి రోజు ఒక్కో కూలీ సుమారు రెండు వందల నుంచి ఐదు వందల వరకు సంపాదిస్తున్నారు. సేకరించిన సీతాఫలాలను హైదరాబాద్ నుంచి వచ్చి కూలీల నుంచి కొనుగోలు చేస్తున్నారు. మండలం నుండి ప్రతిరోజు ఐదు నుంచి ఎనిమిది ఆటో వరకు తరలిపోతున్నాయి. భలే గీరాకి సీతాఫలాలలో ఔషధ గుణాలు ఎక్కువ ఉండడంతో సీజన్లో సీతాఫలాలకు గిరాకీ పెరిగింది. గత ఏడాది కంటే ఈ సారి వ్యాపారం జోరందుకుంది. కాలం కలిసిరావడమే కాకుండా చెట్లకు ఎక్కువ శాతం కాయలు కాయడంతో కూలీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సుమారుగా ఒక్క చెట్టుకు వందకు పైగా కాయలు కాశాయి. గ్రామాల్లో ఉదయమే అటవీప్రాంతానికి వెళ్లి సాయంత్రం అమ్ముకుని ఇంటి దారి పడుతున్నాయి. సీతాఫలాలలో ఔషధ గుణాలు ఉండడంతో చాలా మంది కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం పిల్లలను సెలవు ఉండడంతో తల్లిదండ్రులతో కలిసి సీతాఫలాల సేకరణకు వెళుతున్నారు. రోజుకు వంద పైగా సంపాదిస్తున్నా : కూలీ, మల్లమ్మ సీతాఫల కాయలతో రోజుకు వందకు పైగానే సంపాదిస్తున్నా. మా ఊరి నుంచి చట్టు ముట్టు గ్రామాల్లో ఉన్న అడవులోకి వెళ్లి రోజుకు రెండుమూడు తట్టల కాయలను తెంపుకుని వస్తున్నా. ఓ రోజు ధర బాగానే ఉంటుంది. ఓ రోజు తక్కువ ధర వస్తుంది. అయినా గత పది రోజలు నుంచి అమ్ముతున్నా. మంచి డిమాండ్ ఉంది. ఎంతో మంది వచ్చి తట్టలకొద్ది కొంటున్నారు. సీతాఫలాలతో ఉపాధి పొందుతున్నా..కూలీ, లక్ష్మి కూలీ పనులు దొరకడం చాలా కష్టంగా మారింది. దీంతో సీతాఫలాలతో ఉపాధి పొందుతున్నా. ప్రతిరోజు రెండు వందల వరకు లాభం వస్తుంది. తిరిగితే కానీ కాయలు దొరకడం లేదు. గతంలో కంటే ఈ సారి చాలా మంది కూలీలు సీతాఫలాల కోసం అడవులు తిరుగుతున్నారు. ఒక్క తట్టకు వంద నుండి రెండు వందల వరకు అమ్ముతున్నా. -
వృథా భూముల్లో అమృత సాగు
వృథా భూములు, రాతినేలలు కలిగి ఉన్న వారికి దిగులు అవసరం లేదు. ఆ భూముల్లోనూ తోటలు పెంచుకోవచ్చని అంటున్నారు ఉద్యాన అధికారులు. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడినిచ్చే సీతాఫలాన్ని సాగు చేసుకోచ్చని సూచిస్తున్నారు. అడవులు, రాతి గుట్టల్లోనే కాకుండా పొలాల్లో అంతర పంటగా కూడా వేసుకోచ్చని చెబుతున్నారు. ఏ పంటకూ అనువుగాని భూముల్లో సీతాఫలాన్ని సాగు చేయొచ్చని ఉద్యాన శాఖ అధికారులు తెలుపుతున్నారు. సీతాఫలం పంట, రకాలు, నాటే పద్ధతులు, నీటి, ఎరువుల యాజమాన్యం తదితర అంశాలపై ఉద్యాన శాఖ సహాయ సంచాలకుడు-2 కె.సూర్యనారాయణ (87344 49066) వివరించారు. -ఖమ్మం వ్యవసాయం ఏ పంటకూ అనువుగాని నేలల్లోనూ సీతాఫలం సీతాఫలంలో పిండి పదార్థాలు (కార్బోహైడ్రేట్స్), విటమిన్ సీ, విటమిన్ ఏ ఉండటం వల్ల పలు రకాల పాల సంబంధిత పదార్థాల తయారీలో ఉపయోగపడుతుంది. అనోనైన్ అనే పదార్థం ఆకులు, గింజలు, ఇతర భాగాల్లో ఉండటం వల్ల చేదుగుణం కలిగి పశువులు, మేకలు తినవు. సీతాఫలం రసాన్ని కీటకనాశినిగా వాడొచ్చు. గింజల నుంచి నూనె తీయొచ్చు. దీనిని పెయింట్, సబ్బు పరిశ్రమల్లో వాడతారు. వాతావరణం సీతాఫలం ఉష్ణ మండల పంట. ఎక్కువ చలి, మంచును తట్టుకోలేదు. అధిక వర్షపాతాన్ని, వర్షాభావ పరిస్థితులను తట్టుకోలేదు. పుష్పించే దశలో పొడి వాతావరణం, కాయ దశలో అధిక తేమ, వర్షపాతం (50 నుంచి 75 సెంటీ మీటర్లు) అనుకూలం. అధిక చలి ఉంటే కాయలు పండుబారాక గట్టిగా, నల్లగా మారతాయి. ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ అయితే పూత రాలిపోతుంది. నేలలు చౌడు, క్షార తప్ప మిగతా అన్ని రకాల నేలల్లోనూ సీతాఫలం తోటలు పెంచుకోవచ్చు. నీరు నిలవని గరప నేలలు, ఎర్రనేల లు శ్రేష్టం. రాళ్లతో ఉన్న నేలల్లో కూడా సాగు చేయొచ్చు. మురుగునీరు పోయే సదుపాయం కలిగి 5.5-7.5 ఉదజని సూచిక గల నేలలు అనుకూలం. రకాలు బాలానగర్: కాయలు పిరమిడ్ ఆకారంలో పెద్ద సైజులో పెద్ద కళ్లతో ఉంటాయి. కళ్ల మధ్య లేత పసుపురంగు నుంచి నారింజరంగులో చూడటానికి ఆకర్షణీయంగా ఉంటాయి. మధురమైన రుచి, 27శాతం చక్కెర కలిగి, 200-260 గ్రాముల సగటు బరువుతో ఉంటాయి. అతిమాయ: కాయలపై చర్మం నునుపుగా ఉండి తక్కువ గింజలు కలిగి తీపి పులుపు కలిగిన ప్రత్యేకమైన గుజ్జు ఉంటుంది. ఈ చెట్లలో పరాగ సంపర్కానికి ప్రతి 20 చెట్లకు ఒకదానిని నాటాలి. అర్కనహాన్: ఇది హైబ్రిడ్ రకం. ఐఐహెచ్ఆర్ బెంగళూరు వారు రూపొందించారు. ఐలాండ్, జమ్ మమ్మిత్ రకాలను సంకరపరచి దీనిని రూపొందించారు. కాయలు గుండ్రంగా చర్మంగా కళ్లు ప్రస్ఫుటంగా లేకుండా నునుపుగా ఉంటాయి. గుజ్జు అత్యంత తియ్యగా, గింజలు చాలా తక్కువగా ఉంటాయి. పింక్స్మమ్మిత్: ఇది ఆస్ట్రేలియా నుంచి దిగుమతి చేసుకున్న రకం. కాయలు పెద్దగా అండాకారంలో ఉండి చర్మం ఆకుపచ్చ మీద పింక్ రంగు కలిగి ఉంటుంది. గుజ్జు తక్కువగా ఉంటుంది. ఐలాండ్జెను: ఇది కూడా ఆస్ట్రేలియా నుంచి దిగుమతి చేసుకున్న రకమే. కాయలు మంచి నాణ్యత కలిగి పెద్దగా నునుపైన చర్మం కలిగి ఉంటాయి. నాటే పద్ధతి పొలం బాగా దుక్కి చేసిన తర్వాత 60ఁ60ఁ60 సెంటీమీటర్ల గుంతలను 5ఁ5 మిల్లీమీటర్లు లేదా 6ఁ6 మిల్లీమీటర్లు ఎడంగా తీసి గుంత నుంచి తీసిన పైమట్టికి 20 కిలోల పశువుల ఎరువు, ఒక కిలో సూపర్ ఫాస్పేట్, 100 గ్రాముల పాలిడాల్ 2శాతం పొడి బాగా కలిపి గుంతలు నింపి అంట్లు నాటుకోవాలి. అంటు నాటేటప్పుడు అంటు కట్టిన భాగం భూమిపైన ఉండేలా చూడాలి. నాటిన తర్వాత నీరు పోసి ఊతం ఇవ్వాలి. కత్తిరింపులు వేరు మూలంపై చిగుళ్లను, కొమ్మలను వెంనువెంటనే తీసివేయాలి.తెగుళ్లుసోకిన అనవసర కొమ్మలు కత్తిరించి తీసివేయాలి. ఎరువులు 50 కిలోల పశువుల ఎరువు ఒక కిలో ఆముదం పిండి, ఒక కిలో ఎముకల పొడి చెట్టు పాదులో ఒకసారి వేసుకోవాలి. ఐదు గ్రాముల యూరియా 700 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్సేట్, 200 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ చెట్టు పాదుల్లో రెండు దఫాలుగా వేసుకోవాలి. నీటి యాజమాన్యం వాతావరణ పరిస్థితిని బట్టి నీటిని పారించాలి. నీరు తక్కువైతే కాయలు గట్టిగా మారి పండవు. డ్రిప్ పద్ధతి పాటించి నీరు సమృద్ధిగా పారిస్తే పెరుగుదల, దిగుబడి అధికంగా ఉంటుంది. దిగుబడి సీతాఫలం నాటిన తర్వాత మూడో యేట నుంచి కాపు వచ్చినా మంచి కాపు 7-8 సంవత్సరాల వయసులో పొందొచ్చు. ఆధునిక యాజమాన్యం పాటించి ఒక్కో చెట్టుకు 100-150 కాయల వరకు దిగుబడి పొందొచ్చు. పక్వదశ కాయలపై కళ్లు ప్రస్ఫుటంగా కనిపిస్తూ కళ్ల మధ్య తెలుపు నుంచి లేత పసుపురంగు లేదా నారింజరంగుకు మారడంతోపాటు కాయలు ఆకుపచ్చ రంగు నుంచి లేత ఆకుపచ్చ రంగుకు మారతాయి. ప్యాకింగ్ సీతాఫలం కోత తర్వాత త్వరగా పండుతాయి. కోసిన వెం టనే గ్రేడ్ చేసి గంపల్లో వేసి సీతాఫలం ఆకులను కింద, పక్క కు వేసి దూరప్రాంతాలకు రవాణా చేయాల్సి ఉంటుంది.