Health Tips In Telugu: వినాయక చవితి నుంచి సంక్రాంతి వరకు విరివిగా లభించే సీజనల్ ఫ్రూట్స్‌లో సీతాఫలం ఒకటి. ఇందులో ఎన్నో పోషక విలువలు, విటమిన్లు, ఖనిజాలు ఉండటం వల్ల దీనిని పోషకాల ఘని అంటారు. సీతాఫలాలు చాలా రుచిగా ఉంటాయి కాబట్టి వీటిని ఇష్టపడని వారు దాదాపు ఉండరు. ఇవిగాక సీతాఫలం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలుసుకుందాం...
►సీతాఫలం అల్సర్లను నయం చేయడంలో, అసిడిటీని నివారించడంలో సహాయపడుతుంది.
►అంతేకాకుండా ఇందులో ఉండే సూక్ష్మపోషకాలు చర్మాన్ని మృదువుగా చేస్తాయి.
►ఇది కంటి చూపును, కురుల అందాన్ని, మెదడు పనితీరునూ మెరుగుపరుస్తుంది.
►సీతాఫలంలోని ఐరన్ కంటెంట్ ఐరన్ లోపాన్ని తగ్గించి, హిమోగ్లోబిన్‌ను మెరుగుపరిచి రక్తహీనతను నివారించగలదు.
బయోయాక్టివ్ అణువుల వల్ల
►సీతాఫలంలోని బయోయాక్టివ్ అణువులు, యాంటీ ఒబెసియోజెనిక్, యాంటీ డయాబెటిస్, క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉంటాయి.
►సీతాఫలం గ్లైసెమిక్ ఇండెక్స్ 54, అంటే లో–గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. అందువల్ల డయాబెటిస్ ఉన్న వారు కూడా సీతాఫలం తినవచ్చు.
►అలాగే ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ మలబద్దకాన్ని అరికడుతుంది.
అతి మాత్రం వద్దు
►ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియం హైబీపీని తగ్గిస్తుంది.
►సీతాఫలంలో ఫైబర్ ఎక్కువ ఎండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచిదే.
►అయితే, ఇది అధిక కేలరీలను కలిగి ఉంటుంది కనుక మోతాదుకి మించి తీసుకో కూడదు.
నోట్: ఈ కథనం కేవలం ఆరోగ్యం గురించి అవగాహన కొరకు మాత్రమే!
చదవండి: World Stroke Day: మెదడుకు ‘పోటు’.. బ్రెయిన్ స్ట్రోక్ నుంచి తప్పించుకోండి ఇలా..
Health Tips: నీరసం.. నిస్సత్తువా? వీటిని ఆహారంలో చేర్చుకున్నారంటే..
రాత్రిపూట పదే పదే మూత్ర విసర్జన: కెఫిన్, శీతల పానీయాలు.. ఇంకా వీటికి దూరంగా ఉండకపోతే
Comments
Please login to add a commentAdd a comment