school walls
-
Custard Apple: ప్రాణం తీసిన సీతాఫలం
సాక్షి, దుగ్గొండి (వరంగల్): వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం స్వామిరావుపల్లిలో ఆదివారం సీతాఫలాల కోసం వెళ్లి బాలుడు మృత్యువాత పడ్డాడు. గ్రామానికి చెందిన జమలాపురం శ్రీనివాస్– మమత దంపతుల కుమారుడు సన్ని(9) ఆదివారం పాఠశాలకు సెలవు కావడంతో ఇంటి సమీపంలోని జమలాపురం చిన్న సాంబయ్య ఇంటి ప్రహరీ పక్కనే ఉన్న సీతాఫలం చెట్టుపై పండ్లు కోయడానికి గోడ ఎక్కాడు, కాయలు కోస్తుండగా ప్రమాదవశాత్తు గోడకూలి పెల్లలు సన్నిపై పడ్డాయి. దీంతో తీవ్రగాయాలైన సన్ని అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహం వద్ద బాలుడి తల్లిదండ్రులు శ్రీనివాస్–మమత రోదనలు కంటతడిపెడుతున్నాయి. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై లక్ష్మారెడ్డి తెలిపారు. చదవండి: Hyderabad: పూల కుండీల్లో గంజాయి మొక్కలు -
పాఠశాల ప్రహరీ కూలి విద్యార్థులకు గాయాలు
అనంతపురం, పుట్టపర్తి టౌన్: పుట్టపర్తి నగర పంచాయతీ పరిధిలో చిత్రావతి రోడ్డులోని గంగమ్మ గుడిపక్కనున్న మండల పరిషత్ ఉన్నత పాఠశాల ప్రహరీ కూలిపోవడంతో నలుగురు విద్యార్థులు గాయపడ్డారు. బుధవారం రేడియో పాఠం వినిపించేందుకుగానూ ఉపాధ్యాయులు మూడో తరగతి పిల్లలను గదుల్లోంచి బయటకు పిలిపించి ప్రహరీకి కాస్త దగ్గరలో కూర్చోబెట్టారు. ఆ సమయంలో ఆ పాఠశాల పక్కన భవనం నిర్మిస్తున్న కాంట్రాక్టరు సుబ్బరాజు జేసీబీతో మట్టి తీయిస్తున్నారు. అయితే ఆ జేసీబీ పొరపాటున ప్రహరీకి తగలడంతో గోడ కూలిపోయింది. ఆ రాళ్లు పడి పాఠశాల లోపల గోడ పక్కన కూర్చుని ఉన్న లావణ్య, మణికంఠ, పవన్, విష్ణు గాయపడ్డారు. ఉపాధ్యాయులు వెంటనే స్థానికుల సహాయంతో వారిని సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుసత్రికి తరలించారు. విష్ణు తలకు బలమైన గాయం కావడంతో మెరుగైన చికిత్స కోసం అనంతపురం తీసుకెళ్లారు. ఈ దుర్ఘటనపై ఉపాధ్యాయురాలు సునందాబాయ్ అర్బన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్ఐ గురుప్రసాద్‌రెడ్డి వివరాలు తెలుసుకుని కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
అసభ్య రాతల్ని అడ్డుకున్న బాలికలపై దాడి
సుపౌల్: స్కూలు గోడలపై అసభ్య రాతలను అడ్డుకున్న విద్యార్థినులపై గ్రామస్తులు దాడికి పాల్పడిన ఘటన బిహార్‌లో చోటుచేసుకుంది. సుపౌల్ జిల్లాలోని దర్పాఖ గ్రామంలో కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం(కేజీబీవీ) పక్కనే మరో స్కూలు ఉంది. అయితే కేజీబీవీ బాలికలు మైదానంలో ఆడుకుంటుండగా అక్కడకు చేరుకున్న కొందరు పక్క స్కూలు అబ్బాయిలు గోడలపై అసభ్య రాతలు రాశారు. దీంతో ఆ అమ్మాయిలు వీళ్లను తన్నితరిమేశారు. వీరంతా ఇళ్లకు వెళ్లి తమపై జరిగిన దాడిని తల్లిదండ్రులకు చెప్పడంతో గ్రామస్తులంతా ఏకమై మైనర్ బాలికలపై ఒక్కసారిగా దాడి చేశారు. ఈ ఘటనలో 30 మంది అమ్మాయిలకు గాయాలయ్యాయి. ఈ ఘటనలో 9 మందిపై ఎఫ్ఐఆర్ నమోదుచేసిన పోలీసులు, ఓ మహిళ సహా ముగ్గురిని అరెస్ట్ చేశారు. -
ప్రహరీలేవీ?
ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులు ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు పట్టించుకోని అధికారులు టేక్మాల్: పాఠశాలల అభివృద్ధిని ప్రభుత్వం విస్మరిస్తోంది. పాఠశాలల్లోత సరైన వసతులు కల్పించడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. కనీసం పాఠశాలల చుట్టూ ప్రహరీలను నిర్మించలేకపోతోంది ప్రభుత్వం. టేక్మాల్ మండలంలో 50 శాతం కంటే ఎక్కువ ప్రహరీలు లేని పాఠశాలలున్నాయి. రహదారుల పక్కన గల పాఠశాలల్లో పిల్లలకు ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. మొక్కలు, పచ్చని చెట్లు మచ్చుకైనా కనిపించడం లేదు. మొక్కలు పెంచుదామన్నా... ప్రహరీలు లేకపోవడంతో సాధ్యం కావడం లేదు. టేక్మాల్ మండలంలో 18 పంచాయతీలకుగాను 42 ప్రాథమిక, 7 ప్రాథమికోన్నత, 6 ఉన్నత పాఠశాలలున్నాయి. ఇందులో సగానికిపైగా పాఠశాలలకు ప్రహరీలు లేవు. మండలంలోని ఎల్లుపేట, తంప్లూర్, బొడ్మట్‌పల్లి, ధనూర ఉన్నత పాఠశాలలు, బొడగట్, కాద్లూర్, వెంకటాపూర్, కమ్మరికత్త, అచ్చన్నపల్లి, దాదాయిపల్లి ప్రాథమిక పాఠశాలలకు ప్రహరీలు లేవు. పాఠశాలల ఆవరణలో పందులు, పశువులు స్వైర విహారం చేస్తున్నాయి. పరిసరాలలను అపరిశుభ్రంగా చేస్తున్నాయి. దుర్గంధం వెదజల్లుతున్నాయి. దుర్వాసనను భరించలేకపోతున్నారు. విద్యార్థులు తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు. తంప్లూర్, ఎల్లుపేట పాఠశాలలు రోడ్డుపైనే ఉండటంతో వాహనాల శబ్ధంతో విద్యార్థుల చదువులకు ఆటంకం కలుగుతోంది. రోడ్డుపై నడుస్తున్నప్పుడు విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం చోటు చేసుకుంటుందోనని వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పాఠశాలలకు మైదానాలు కూడా సరిగ్గా లేవు. ఫలిలతంగా విద్యార్థులు క్రీడలకు దూరమవుతున్నారు. ఉన్న మైదానాల్లో పూర్తిగా కంకర, రాళ్లు తేలడంతో ఆటలు ఆడలేకపోతున్నారు. పొలాల్లో క్రీడలు ఆడాల్సిన దుస్థితి నెలకొంటోంది. కనిపించని పచ్చదనం ప్రహరీలు లేకపోవడంతో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో పచ్చదనం కనిపించడం లేదు. మొక్కలు పెంచుతున్నా... వాటికి రక్షణ లేకపోవడంతో పెరగలేకపోతున్నాయి. పశువులు, గొర్రెలు, మేకలు పాఠశాలల్లోకి వచ్చి మొక్కలను తింటున్నాయి. కొన్ని మారుమూల గ్రామాల్లో సెలవురోజులు, వర్షాకాలంలో పాఠశాలలు పశువులు, పందులకు ఆవాసంగా మారుతున్నాయి. ప్రహరీలుంటే మొక్కలకు పెంచి ఆహ్లదకరమైన వాతావరణాన్ని కల్పించడానికి వీలుంటుందని ఉపాధ్యాయులు అంటున్నారు. పాఠశాలలకు ప్రహరీలు నిర్మించాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు విన్నవించినా ఏ మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.