
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లో గురువారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడిపోయింది. కు నల్లా ప్రాంతంలోని రాంనగర్-ఉధంపూర్ రోడ్డు మార్గంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా 28 మందికి గాయాలయ్యాయి. ఘటనాస్థలానికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది మృతదేహాలను వెలికితీసి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.