
శ్రీనగర్ : జమ్ము కశ్మీర్‌లో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో సుమారు 35 మంది మృతిచెందగా.. మరికొంత మంది తీవ్ర గాయాలపాలయ్యారు. కిష్టావర్ నుంచి కేశ్వాన్‌కు బయల్దేరిన మినీబస్సు మలుపు తీసుకునే క్రమంలో అదుపు తప్పి లోయలో పడిపోయింది. సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడంతోనే ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది.
కాగా స్థానికుల సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక ఈ విషాదకర ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment