Three Soldiers Died After Vehicle Falls Into Gorge In Kupwara - Sakshi
Sakshi News home page

జమ్ముకశ్మీర్‌లో విషాదం.. ముగ్గురు సైనికులు మృతి

Published Wed, Jan 11 2023 10:59 AM | Last Updated on Wed, Jan 11 2023 11:21 AM

Three Soldiers Die After Vehicle Falling Into Gorge In Kupwara - Sakshi

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. బుధవారం జరిగిన ప్రమాదంలో ముగ్గురు సైనికులు మృతిచెందారు. ట్రాక్‌పై దట్టమైన పొగ మంచు కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. 

వివరాల ప్రకారం.. జమ్ముకశ్మీర్‌లో కుప్వారా జిల్లాలోని మాచల్‌ సెక్టార్‌లో నియంత్రణ రేఖ వెంబడి సైనికులు బుధవారం పెట్రోలింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ముగ్గురు సైనికులు లోయలో జారిపడి మరణించారు. కాగా, లైన్‌ ఆఫ్‌ కంట్రోల్‌ వెంబడి పెట్రోలింగ్‌ చేస్తుండగా చినార్‌ క్రాప్స్‌కు చెందిన జేసీఓతోపాటు మరో ఇద్దరు సైనికులు లోయలోకి జారిపడిపోయారు. ఈ క్రమంలో వారు మరణించినట్టు ఆర్మీ అధికారులు అధికారికంగా వెల్లడించారు. అయితే, ట్రాక్‌పై దట్టమైన మంచు కురవడంతో ఈ ప్రమాదం జరిగనట్టు అధికారులు చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement