షిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పర్యాటకులతో వెళుతున్న టెంపో ట్రావెలర్ కులు జిల్లాలోని బంజార్ సబ్ డివిజన్ సమీపంలో అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఘటన ఆదివారం రాత్రి 8.30 గంటల సమయంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు టూరిస్టులు మృతి చెందారు. దాదాపు 10 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న అధికారులు స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
‘కులు జిల్లా బంజర్ వ్యాలీలోని ఘియాఘి సమీపంలో టూరిస్ట్ వాహనం కొండపై నుంచి బోల్తా పడింది. ఈ ఘటనలో ఏడుగురు మృత్యువాతపడ్డారు. మరో పది మందికి గాయాలయ్యాయి. అయిదుగురిని కుళ్లులోని జోనల్ ఆసుపత్రికి తరలించాడం. మరో అయిదుగురికి బంజార్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నాం’మని కులు ఎస్పీ గురుదేవ్ సింగ్ తెలిపారు. బాధితులంతా రాజస్థాన్, మధ్యప్రదేశ్, హర్యానా, ఢిల్లీ సహా పలు రాష్ట్రాలకు చెందిన వారుగా గుర్తించారు.
చదవండి: అసోం సీఎం హిమంత, సద్గురుపై కేసు
Comments
Please login to add a commentAdd a comment