సాక్షి, జగిత్యాల: జగిత్యాల జిల్లాలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణీకులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు చక్రాలు ఒక్కసారిగా ఊడిపోవడంతో ప్రమాదం జరిగింది. ఈ క్రమంలో బస్సు రోడ్డుపై కుంగిపోయింది. అధిక లోడ్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.
కాగా, జగిత్యాల నుండి నిర్మల్ వెళ్తున్న ఆర్టీసీ పల్లె వెలుగు బస్సుకు ప్రమాదానికి గురైంది. అయితే, బస్సులో దాదాపు 150 మంది ప్రయాణీకులు ఎక్కారు. దీంతో, బస్సు కొంత దూరం వెళ్లగానే అధిక లోడ్ కారణంగా టైర్లు ఊడిపోయాయి. ఒక్కసారిగా భారీ శబ్ధంతో బస్సు రోడ్డుపై కుంగిపోయింది. అకస్మాత్తుగా జరిగిన పరిణామంతో ఏమైందో అర్థం కాక ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. డ్రైవర్ ఎంతో చాకచక్యంగా బస్సును నిలిపాడు.
మరోవైపు.. ఈ ప్రమాదం కారణంగా ఊడిపోయిన బస్సు వెనుక భాగంలోని రెండు చక్రాలు పక్కనే ఉన్న చెట్ల పొదల్లో పడిపోయాయి. కాగా, ఈ ప్రమాదం కారణంగా బస్సులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక, వరుస సెలవుల కారణంగా ప్రయాణీకులు స్వగ్రామాలకు వెళ్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment