కేరళలో బస్సు ప్రమాదం.. ఇద్దరి మృతి | ksrtc bus accident plunges kannampuzha river kozhikode kerala | Sakshi
Sakshi News home page

కేరళలో బస్సు ప్రమాదం.. ఇద్దరి మృతి

Published Tue, Oct 8 2024 5:10 PM | Last Updated on Tue, Oct 8 2024 6:52 PM

ksrtc bus accident plunges kannampuzha river kozhikode kerala

తిరువనంతపురం: కేరళలోని ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కోజికోడ్‌ తిరువంబాడి ప్రాంతంలో  కర్టాటక ఆర్టీసీ బస్సు అదుపు తప్పి కల్వర్టును ఢీకొని కాళియంబుజ నదిలో పడిపోయింది. ఈ ప్రమాదం మంగళవారం మధ్యాహ్నం 1:40 గంటల సమయంలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో​ ఇద్దరు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

 

నదిలో పడేముందు బస్సు బోల్తా పడటంతో పలువురు ప్రయాణికులకు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని.. సహాయక చర్యలు  చేపట్టారు. గాయపడిన వారిని కోజికోడ్ మెడికల్ కాలేజీ, ఓమసేరీలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మృతి చెందినవారిలో అనక్కంపోయిల్‌కు చెందిన 63 ఏళ్ల రాజేశ్వరి వృద్దురాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement