ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. లోయపడిన బస్సు | Bus Enroute To Haldwani Falls Into Gorge In Bhimtal | Sakshi
Sakshi News home page

ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. లోయపడిన బస్సు

Published Wed, Dec 25 2024 4:18 PM | Last Updated on Wed, Dec 25 2024 4:35 PM

Bus Enroute To Haldwani Falls Into Gorge In Bhimtal

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 27 మంది ప్రయాణికులతో వెళుతున్న బస్సు 1500 అడుగుల లోయలో పడింది. ఈ దుర్ఘటనలో పలువురు మృతి చెందారు. 

పోలీసుల వివరాల మేరకు.. ఉత్తరాఖండ్‌ రాష్ట్రం నైనిటాల్ జిల్లాకు చెందిన ఓ బస్సు 27మంది ప్రయాణికులతో భీమ్‌టాల్ నుండి హల్ద్వానీకి వెళ్తుంది. అయితే నైనిటాల్ జిల్లా భీమ్‌తాల్‌లోని అమ్దాలి సమీపంలో బస్సు అదుపు తప్పింది. పక్కన ఉన్న 1500అడుగుల లోయలో పడింది. ఈ ప్రమాదం ముగ్గురు మృతి చెందారు. పదిమంది గాయపడ్డారు. ప్రమాదంతో అప్రమత్తమైన పోలీసులు, స్థానిక రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. నైనిటాల్ నుండి ఎస్‌డీఆర్‌ఎఫ్‌,అగ్నిమాపక శాఖ బృందాలను సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. 

కాగా, రోడ్డు ప్రమాదంపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఎక్స్‌ వేదికగా విచారం వ్యక్తం చేశారు. స్థానిక అధికారులు ప్రమాద బాధితులకు తక్షణమే సహాయక చర్యలు అందించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రయాణికులందరూ క్షేమంగా ఉండాలని కేదార్ బాబాను కోరుకున్నారు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement