ఉధంపూర్‌ దుర్గ్‌ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.. రెండు బోగీలు దగ్ధం | Udhampur Durg Express Catches Fire in Madhya Pradesh Morena | Sakshi
Sakshi News home page

ఉధంపూర్‌ దుర్గ్‌ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.. రెండు బోగీలు దగ్ధం

Published Fri, Nov 26 2021 6:03 PM | Last Updated on Fri, Nov 26 2021 6:28 PM

Udhampur Durg Express Catches Fire in Madhya Pradesh Morena - Sakshi

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో విషాదం చోటు చేసుకుంది. ఉధంపూర్‌ దుర్గ్‌ ఎక్స్‌ప్రెస్‌లో శుక్రవారం మంటలు చెలరేగాయి. ఢిల్లీ నుంచి చత్తీస్‌గఢ్‌ దుర్గ్‌ వెళ్తుండగా రైలులోని నాలుగు బోగీల్లో మంటలు చెలరేగాయి. రైలు హేమంత్‌పూర్‌ రైల్వే స్టేషన్‌ దాటిని కొద్ది సేపటికే ఏ1, ఏ2 బోగీల్లో ఉన్నట్లుండి మంటలు చెలరేగాయి. మరో రెండు బోగీలకు మంటలు వ్యాపించాయి.
(చదవండి: ‘జోకర్‌’ బీభత్సం: రైల్లో మంటలు.. 10 మందికి గాయాలు)

ఈ సంఘటనలో ఏ1, ఏ2 బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. అయితే ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని.. ప్రాణ నష్టం సంభవించించలేదని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంపై ఎన్‌సీఆర్‌ అధికారి డాక్టర్‌ శివం శర్మ స్పందించారు. రైలులో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో ఎవరూ మరణించలేదని.. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే బోగీల్లో ఉన్న వారిని సురక్షితంగా కాపాడినట్లు తెలిపారు. 

చదవండి: తాజ్ ఎక్స్‌ప్రెస్ రైలులో అగ్నిప్ర‌మాదం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement