న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా (కోవిడ్-19) వ్యాప్తి అంతకంతకూ పెరుగుతుండటంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్ బారినపడకుండా ప్రజల్లో అవగాహన కల్పించడంతోపాటు బాధితులకు సత్వర వైద్య చికిత్స అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈక్రమంలోనే కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్‌లోని ఉద్ధంపూర్‌లో 100 పడకలు గల 4 ఐసోలేషన్ వార్డులు సిద్ధమయ్యాయని ట్విటర్ వేదికగా కేంద్రం వెల్లడించింది. ఉద్ధంపూర్‌లోని కమాండ్ ఆస్పత్రిలో ఈ ఏర్పాటు చేసినట్టు తెలిపింది. కరోనా అనుమానితులకు చికిత్స అందించేందుకు స్పెషలిస్టు డాక్టర్ల బృందాన్ని ఏర్పాటు చేసినట్టు పేర్కొంది. కాగా, గురువారం రాత్రి 9 గంటల వరకు దేశ వ్యాప్తంగా 74 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, ప్రపంచవ్యాప్తంగా ఆ సంఖ్య 1,28,872 కు చేరడం ఆందోళనకరం.
(చదవండి: దేశవాసులకు ప్రధాని మోదీ కీలక సూచనలు!)
కరోనా అలర్ట్: 100 బెడ్లు రెడీ!
Published Thu, Mar 12 2020 8:43 PM | Last Updated on Thu, Mar 12 2020 8:58 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment