
మర్రి.. కనువిందేమరి
‘ఇంతింతై.. వటుడింతై’ అన్న చందంగా పాఠశాల భవనంపై పెరిగిన ఓ మొక్క.. నేడు ఓ చెట్టుగా రూపాంతరం చెందింది. మండలంలోని ఎన్కేపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాలకు గతంలో నిర్మించిన భవనం శిథిలమవడంతో ఉపయోగించకుండా వదిలేశారు. ఇదే ఆవరణలో పాఠశాలకు కొత్తగా వేరే గదులు నిర్మించడంతో వాటిని వినియోగిస్తున్నారు. ఈ వృథా పాఠశాల భవాన్ని తొలగించకుండా అలాగే వదిలేయడంతో అప్పట్లో మట్టితో నిర్మించిన ఈ భవనంపై ఓ మర్రి మొక్క పెరిగింది. అది నేడు పెద్దదై ఏర్లు.. ఊడలు రావడంతో చిన్న సైజూ వృక్షాన్ని తలపిస్తోంది.
- మొయినాబాద్ రూరల్