తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులందరికీ ఈ నెల 31, వచ్చే నెల 1, 2 తేదీల్లో డివిజన్‌స్థాయిలో శిక్షణ నిర్వహించేందుకు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులందరికీ ఈ నెల 31, వచ్చే నెల 1, 2 తేదీల్లో డివిజన్‌స్థాయిలో శిక్షణ నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లాల విద్యా శాఖాధికారులకు సూచించింది. పరీక్షల సంస్కరణలు, కొత్త పాఠ్య పుస్తకాలు, కమ్యూనిటీ మొబిలైజేషన్, స్కూల్ డెవలప్‌మెంట్ ప్లాన్, స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీల నిర్వహణ, నాయకత్వ లక్షణాలు, నాణ్యతాప్రమాణాల పెంపుపై ఈ శిక్షణ ఇవ్వనుంది. త్వరలో ప్రైవేటు ఉపాధ్యాయులు, హెచ్‌ఎంలకూ శిక్షణ ఇవ్వనుంది. ఆ ఏర్పాట్లపై 29న టెలి కాన్ఫరెన్స్ నిర్వహించనుంది.
నేటి నుంచి టీఎస్‌యూటీఎఫ్ రెండో దశ విద్యాయాత్ర
మంగళవారం (ఈ నెల 27) నుంచి 31వ తేదీ వరకు రెండో దశ విద్యాయాత్ర ఐదు రోజులపాటు వరంగల్, ఖమ్మం జిల్లాల్లో నిర్వహించనున్నట్లు టీఎస్‌యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి రవి ఒక ప్రకటనలో తెలిపారు.