ఈనెల 16 నుంచి 26వ తేదీ వరకు 9, 10 తరగతుల నూతన పాఠ్యపుస్తకాలు, పరీక్షల సంస్కరణలపై శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డీఈఓ కె. అంజయ్య ఒక ప్రకటనలో తెలిపారు.
వైవీయూ : ఈనెల 16 నుంచి 26వ తేదీ వరకు 9, 10 తరగతుల నూతన పాఠ్యపుస్తకాలు, పరీక్షల సంస్కరణలపై శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డీఈఓ కె. అంజయ్య ఒక ప్రకటనలో తెలిపారు. 16వ తేదీ నుంచి ప్రతిరోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. స్కూల్‌కాంప్లెక్స్‌లు, ఎంఆర్‌సీలు లేదా మండల అభివృద్ధి కార్యాలయాల నందు ఆర్‌ఓటీ టర్మినల్ ద్వారా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ శిక్షణ కాలంలో ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు ఎటువంటి సెలవులు మంజూరు చేయమని తెలిపారు. ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ పాఠశాలల ఉపాధ్యాయులు కూడా వారి సబ్జెక్టు రోజున సమీపంలోని శిక్షణ కేంద్రానికి పంపాలని కోరారు.
స్కూల్ కాంప్లెక్స్, ఎంఆర్‌సీ లలోని ఆర్‌ఓటీ టర్మినల్స్‌కు ఏవైనా మరమ్మతులు ఉంటే సరిచేయించి వాటిని శిక్షణకు సిద్ధం చేయాలని కోరారు. ఈ నెల 16న అన్ని యాజమాన్యాల పరిధిలోని ప్రధానోపాధ్యాయులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. 17న తెలుగు, 18న ఇంగ్లీషు, 19న హిందీ, 20న గణితం, 21 ఫిజికల్ సైన్స్, 23 బయోలాజికల్‌సైన్స్, 24న సోషియల్, 25న ఉర్దూ, 26న సంస్కృతం ఉపాధ్యాయులు హాజరుకావాలని కోరారు.