![Israel Strikes On School Hospital Building In Gaza](/styles/webp/s3/article_images/2024/07/27/gazabomb1.jpg.webp?itok=sg_M8ecR)
గాజా: పాలస్తీనాలోని గాజాపై ఇజ్రాయెల్ బాంబుల మోత మోగిస్తూనే ఉంది. తాజాగా గాజాలోని ఓ స్కూల్ భవనంలో నిర్వహిస్తున్న ఆస్పత్రిపై ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడిలో 30 మంది ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. ఈ దాడిలో మరో 100 మంది గాయపడ్డారు. సెంట్రల్ గాజాలోని డీర్-అల్-బలా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
ప్రజలు అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ ఆదేశాలు ఇచ్చిన కొద్దిసేపటికే స్కూల్‌లోని ఆస్పత్రిపై బాంబుల వర్షం కురిసింది. ఇది కాక మరో దాడిలో 11 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. దాడుల ప్రభావంతో ఖాన్ యూనిస్ నగరం నుంచి ప్రజలు భారీ ఎత్తున తరలి వెళుతున్నారు.
గత ఏడాది అక్టోబర్ నుంచి హమాస్ నిర్మూలనే లక్ష్యంగా గాజాలో ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. తమ దేశంపై దాడి చేసినందుకు ప్రతీకారంగా అప్పటి నుంచి హమాస్‌పై దాడులు కొనసాగిస్తూనే ఉంది.
Comments
Please login to add a commentAdd a comment