జెరూసలెం: ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలతో పశ్చిమాసియాలో పరిస్థితులు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనూ గాజాపై ఇజ్రాయెల్ దాడులు ఆపడంలేదు. తాజాగా తూర్పు గాజాలోని ఓ స్కూల్‌లో తలదాచుకుంటున్న వారిపై ఇజ్రాయెల్ బాంబులతో దాడి చేసింది.
ఉదయం ప్రార్థనల సందర్భంగా జరిగిన ఈ దాడిలో దాదాపు వంద మందికి పైగా ప్రజలు మరణించగా, పలువురు గాయపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. గత వారం గాజాలోని మూడు స్కూల్ భవనాలపై ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో పదుల సంఖ్యలో గాజావాసులు మరణించారు.
గతేడాది అక్టోబరు 7న హమాస్ ఉగ్రవాదుల మెరుపు దాడుల్లో వందల మంది ఇజ్రాయెల్ పౌరులు మరణించారు. ఇందుకు ప్రతీకారంగా అప్పటినుంచి గాజాపై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. ఈ దాడుల్లో ఇప్పటివరకు గాజాలో 40 వేల మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు.
Comments
Please login to add a commentAdd a comment