రోజూలాగే స్కూల్ నుంచి ఇంటికి బయలుదేరిన విద్యార్థులపైకి బొలెరో వాహనం మృత్యువుగా దూసుకొచ్చింది. విద్యార్థులు రోడ్డు దాటుతుండగా జరిగిన ఈ ఘటనలో 9 మంది అక్కడికక్కడే మృతిచెందగా, 20 మంది గాయపడ్డారు. హృదయ విదారకమైన ఈ సంఘటన బిహార్‌లోని మిణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది.బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దీనిపై స్పందించి చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.