మెదక్, న్యూస్‌లైన్: బడీడు గల పిల్లలను బడికి పంపకపోతే వారి ఇళ్లముందే బైఠాయిస్తామని జిల్లా విద్యాశాఖ అధికారి గాజర్ల రమేశ్ హెచ్చరించారు. శనివారం మెదక్ పట్టణంలో నిర్వహించిన స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, సీఆర్‌పీల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఈ విద్యా సంవత్సరం ఆరంభంలో 2,409 మంది బడిబయట పిల్లలు ఉండగా, నేడు వారి సంఖ్య 338కి చేరిందన్నారు. అయినప్పటికీ కొన్ని చోట్ల బడిబయట, బడిమానేసిన పిల్లలు ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈయేడు ఆశించిన రీతిలో అడ్మిషన్లు జరగలేదని తెలిపారు. బడిబయట పిల్లలుంటే అందుకు కాంప్లెక్స్ హెచ్‌ఎంలు, సీఆర్పీలనే బాధ్యులను చేస్తామన్నా రు. తల్లిదండ్రులు తమ పిల్లలను బడికి పంపకపోతే ఉపాధ్యాయులతో కలిసి వారి ఇంటి ముందు బైఠాయించడానికి వెనుకాడబోమని స్పష్టం చేశారు.
విద్యాహక్కు చట్టం అమలులోకి వచ్చిన తరువాత పిల్లలను బడికి పంపకపోవడం కూడా నేరమేనన్నారు. అవసరమైతే ఇందుకు పోలీసుల సహకారం తీసుకుంటామన్నారు. ప్రాథమిక విద్యను బలోపేతం చేయడానికి కాంప్లెక్స్ హెచ్‌ఎంలకు పూర్తిస్థాయి అధికారాలు ఇచ్చామన్నారు. ప్రాథమిక పాఠశాలల్లో ఎలాంటి సమస్యలున్నా, ఉపాధ్యాయులు విధుల్లో నిర్లక్ష్యం వహించినా కాంప్లెక్స్ హెచ్‌ఎంలు తన దృష్టికి తేవాలని సూచించా రు. నిధుల వినియోగం, మధ్యాహ్న భోజనం పథకాలను పర్యవేక్షించాలన్నారు. నిర్లక్ష్యం వహించిన ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. ఎంఈఓలకన్నా కాంప్లె క్స్ హెచ్‌ఎంలకే ఎక్కువ అధికారాలు ఇచ్చామని తెలిపారు. ఈనెల 30 నుంచి జరిగే స్కూల్ గేమ్స్ ఫెడరేషన్‌లో అన్ని పాఠశాలల విద్యార్థులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈనెల 30 నుంచి ఇంగ్లిష్ టీచర్లకు స్పోకెన్ ఇంగ్లిష్‌పై శిక్షణ ఇస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో డిప్యూటీ ఈఓ సామెల్, ఏఎంఓ సత్యనారాయణ పాల్గొన్నారు.
మధ్యాహ్న భోజనంపై ప్రత్యేక శ్రద్ధ
సిద్దిపేట: మధ్యాహ్న భోజనం నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని డీఈఓ రమేశ్ ఎంఈ ఓలకు సూచించారు. సిద్దిపేటలో ఎంఈఓలు, హెచ్‌ఎంలు, సీఆర్‌పీలతో సమావేశమయ్యా రు. నిర్మాణాత్మక పరీక్ష (ఎస్-1)ప్రశ్న పత్రాలను ఈనెల 26, 27వ తేదీల్లో నిర్వహించే కాంప్లెక్స్ సమావేశాల్లో తయారు చేయాలని ఆదేశించారు.
బడికి పంపకపోతే బైఠాయిస్తాం
Published Sun, Aug 25 2013 12:42 AM | Last Updated on Sat, Sep 15 2018 5:06 PM
Advertisement