
బెంగళూరులో స్కూల్ బిల్డింగ్ కూలి ముగ్గురు మృతి
బెంగళూరులో ఓ స్కూల్ భవనం కూలిన ఘటనలో ఓ చిన్నారి సహా ఇద్దరు మృతి చెందారు.
బెంగళూరు : బెంగళూరులో ఓ స్కూల్ భవనం కుప్పకూలిన సంఘటనలో ముగ్గురు మృతి చెందగా మరొకరు గాయపడ్డారు. అదుగుడిలోని బాష్ ఫ్యాక్టరీ సమీపంలో మంగళవారం ఉదయం ఈ సంఘటన చోటుచేసుకుంది. మరో మహిళ శిథిలాల కింద చిక్కుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
కాగా సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేశారు. శిథిలాల కింద చిక్కుకున్న మహిళ సజీవంగా ఉందో లేదో ఇంకా తెలియాల్సి ఉందని డీసీపీ హెచ్ ఎస్, రేవన్న తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.