వెయ్యికి పైగా శిథిల భవనాల్లోనే పాఠాలు
బితుకుబితుకుమంటున్న పిల్లలు, టీచర్లు
నిధుల్లేక మధ్యలోనే నిలిచిన స్కూలు భవనాలు
‘విద్యా వ్యవస్థలో ఎన్ని మార్పులో తీసుకొస్తున్నాం.. ప్రైవేటు స్కూళ్లకు దీటుగా సర్కారు బడులను తీర్చిదిద్దుతున్నాం.. అన్ని సదుపాయాలూ సమకూరుస్తున్నాం.. సమస్యలు పరిష్కరిస్తున్నాం..’ అంటూ తరచూ ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకూ ఊదరగొడుతున్నారు. కానీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు పోతున్నామంటూ తరచూ వల్లించే ముఖ్యమంత్రి పాలనలో, విద్యాశాఖ మంత్రి ఇలాకాలో నేటికీ చెట్ల కింద, వీధి అరుగులపైన, పూరి గుడిసెల్లోనూ, శిథిల భవనాల్లో, వరండాల్లో పాఠాలు సాగుతున్నాయంటే ఎంత ముందుకు పోతున్నామో తేటతెల్లమవుతోంది. అమాత్యులు దత్తత తీసుకున్న గ్రామాల్లో సైతం నేలపై చదువు సాగుతోందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సవాలక్ష సమస్యల నడుమ సోమవారం నుంచి సర్కారు బడులు ఎప్పటిలాగే మళ్లీ తెరుచుకుంటున్నాయి. - సాక్షి నెట్‌వర్క్