పుల్లంపేటః తెలుగుదేశంపార్టీ ఆగడాలకు అడ్డు అదుపులేకుండా పోతోంది. అధికారాన్ని అడ్డంపెట్టుకుని దుర్వినియోగాలకు పాల్పడుతున్నారు. భావిభారత పౌరులుగా తీర్చిదిద్దే ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగుదేశంపార్టీ తమరాజకీయ లబ్ధి కోసం జనచైతన్యయాత్రల పేరుతో పాఠశాల సమయాన్ని దుర్వినియోగం చేశారు. అనంతంపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గురువారం తెలుగుదేశంపార్టీ నాయకులు పాఠశాల ఆవరణలో విద్యార్థులకు పాఠ్యాంశాలు జరిగే సమయంలో జనచైతన్యయాత్ర సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైల్వేకోడూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ రామచంద్రనాయుడు, టీడీపీ పుల్లంపేట అధ్యక్షుడు కృష్ణమనాయుడు తదితరులు పాల్గొన్నారు. దీంతో విద్యార్థులు తీవ్రఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వ పాఠశాలల్లో జనచైతన్యయాత్రను నిర్వహించవచ్చా అని ఎంఈవో చెంగల్‌రెడ్డిని వివరణకోరగా నేను లీవ్‌లో ఉన్నానని తెలిపారు.