లావేరు మండలం దామాడలో విషాదం చోటుచేసుకుంది.
శ్రీకాకుళం: లావేరు మండలం దామాడలో విషాదం చోటుచేసుకుంది. దామాడ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో స్కూలు బిల్డింగ్‌పైకి ఎక్కబోతూ, ప్రమాదవశాత్తూ కిటికీ పైన ఉండే స్లేడ్ విరిగిపడటంతో చిన్ని తవుడు(13) అనే తొమ్మిదో తరగతి విద్యార్థి అక్కడిక్కడే మృతిచెందాడు. బాలుడి మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.