నిర్మాణంలో ఉన్న ఓ స్కూలు బిల్డింగ్నుంచి జారిపడి మృతిచెందిన బాలుడి మృతదేహాన్ని తీసుకునేందుకు తల్లిదండ్రులు తిరస్కరించారు.
సాలెం(తమిళనాడు): నిర్మాణంలో ఉన్న ఓ స్కూలు బిల్డింగ్నుంచి జారిపడి మృతిచెందిన బాలుడి మృతదేహాన్ని తీసుకునేందుకు తల్లిదండ్రులు తిరస్కరించారు. తమ కుమారుడి మృతికి కారణమైన పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు. ఈ ఘటన తమిళనాడులోని సాలెం నగరంలో చోటుచేసుకుంది. వివరాలవి... 13ఏళ్ల వయస్సు ఉన్న ఓ విద్యార్థి సాలెంలోని రెసిడెన్షియల్ స్కూల్లో ఏడవ తరగతి చదువుతున్నాడు. నివాస ప్రాంతానికి 27కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలకు వెళ్లిన విద్యార్థి స్కూల్ ఆభరణంలో నిర్మాణ పనులు జరుగుతున్న కొత్త బిల్డింగ్పైకి ఒంటరిగా వెళ్లాడు. ప్రమాదవశాత్తూ కాలు జారిపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. తీవ్రగాయాలపాలైన బాలుడు అపస్మారక స్థితిలో వెళ్లడంతో అత్యవసర చికిత్స నిమిత్తం హుటాహుటినా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
అప్పటికే బాలుడు మృతిచెందినట్టు ఆస్పత్రి వైద్యులు నిర్థారించారు. దాంతో మృతదేహనికి పోస్టుమార్టం నిర్వహించినట్టు పోలీసులు తెలిపారు. అయితే పోస్టుమార్టం అనంతరం విద్యార్థి మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించేందుకు వెళ్లగా బాలుడి తల్లిదండ్రులు, బంధువులు తీసుకునేందుకు తిరస్కరించారు. అంతేకాక తమ కుమారుడి మృతికి కారణమైన స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు. స్కూలు యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే తమ కుమారుడు మృతిచెందినట్టు వారు ఆరోపిస్తున్నారు. కుమారుడి ఒంటిరిగా వెళ్లనిచ్చిన స్కూలు టీచర్లు, యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాల్సిందిగా వారు డిమాండ్ చేశారు. పోలీసులు నచ్చజెప్పడంతో చివరికి బాలుడి మృతదేహాన్ని తల్లిదండ్రులు తీసుకునేందుకు అంగీకరించారు. దాంతో పోలీసులు ఈ ఘటనకు కారకులైన వారిపై చర్యలు తీసుకుంటామని హమీ ఇచ్చారు.