గాజా: స్కూల్‌పై ఇజ్రాయెల్‌ దాడి.. 15 మంది మృతి | Israeli Strike On Gaza School Kills 15 | Sakshi
Sakshi News home page

గాజా: స్కూల్‌పై ఇజ్రాయెల్‌ దాడి.. 15 మంది మృతి

Jul 15 2024 9:00 AM | Updated on Jul 15 2024 9:35 AM

Israeli Strike On Gaza School Kills 15

గాజా: పాలస్తీనాలోని గాజా పట్టణంలో ఉన్న స్కూళ్లపై ఇజ్రాయెల్‌ దాడులు  కొనసాగుతున్నాయి. తాజాగా ఆదివారం(జులై 15) సెంట్రల్‌ గాజాలోని అబు అరబన్‌ ప్రాంతంలోని ఓ స్కూల్‌పై ఇజ్రాయెల్‌ బాంబులు వేసింది. ఈ దాడిలో స్కూలులో ఆశ్రయం పొందుతున్న గాజా వాసులు 15 మంది మృతి చెందారు. 

ఈ విషయాన్ని గాజా సివిల్‌ డిఫెన్స్‌ ఏజెన్సీ వెల్లడించింది. యుద్ధం కారణంగా నిరాశ్రయులైన గాజా వాసులు వేలాది మంది అబు అరబన్‌ స్కూల్‌లో తాత్కాలికంగా ఆశ్రయం పొందుతున్నారు. గడిచిన ఎనిమిది రోజుల్లో గాజా వాసులు ఆశ్రయం పొందుతున్న స్కూళ్లపై ఇజ్రాయెల్‌ దాడి చేయడం ఇది ఐదోసారి. ఈ దాడిపై ఇజ్రాయెల్‌ స్పందించింది. 

అబు అరబన్‌ స్కూల్‌ కేంద్రంగా ఇజ్రాయెల్‌ సైన్యంపై దాడులు జరుగుతున్నందునే తాము టార్గెట్‌ చేశామని తెలిపింది. గతేడాది అక్టోబర్‌ 7న పాలస్తీనాకు చెందిన  ఉగ్రవాద సంస్థ హమాస్‌ ఇజ్రాయెల్‌పై మెరుపుదాడికి దిగి వందలాదిమందిని చంపింది. అప్పటి నుంచి గాజాపై ఇజ్రాయెల్‌ బాంబుల వర్షం కురిపిస్తూనే ఉంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement