ఇన్ఫార్మర్ల హత్యలపై విభేదించా: ఉసెండి
ఇన్ఫార్మర్ల పేరుతో సామాన్యులను మావోయిస్టులు హత్యలు చేయడంపై తాను విభేదించానని మాజీ మావోయిస్టు నేత గుమ్మడివెల్లి వెంకట కిషన్ ప్రసాద్ అలియాస్ గుడ్సా ఉసెండి తెలిపారు. తాను అనారోగ్య కారణాల వల్లనే పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు చెప్పారు. మావోయిస్టులు పాఠశాల భవనాలను కూల్చేయడాన్ని తాను పార్టీలో తీవ్రంగా ఖండించినట్లు ఆయన తెలిపారు.
కాగా, చత్తీస్గఢ్ పీసీసీ అధ్యక్షుడిని, కేంద్ర మంత్రి కాన్వాయ్‌ని లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు జరిపిన దాడిపై ఎన్.ఐ.ఎ. అధికారులు, ఉసెండి నుంచి సమాచారం రాబడుతున్నారు. 2010 ఏప్రిల్ 6వ తేదీన చింతల్‌నార్ అటవీ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ 62వ బెటాలియన్‌కు చెందిన 76 మంది మృతికి కారణమైన మావోయిస్టుల దాడిపై సీఆర్పీఎఫ్ కూడా వివరాలు రాబడుతోంది.