తరగతి పైకప్పు కూలి విద్యార్థులకు గాయాలు | school students injures as part of ceiling falls | Sakshi
Sakshi News home page

తరగతి పైకప్పు కూలి విద్యార్థులకు గాయాలు

Published Wed, Jan 21 2015 1:54 PM | Last Updated on Sat, Sep 15 2018 5:06 PM

school students injures as part of ceiling falls

నిజామాబాద్: తరగతి గది పైకప్పు పెచ్చులు కూలిపడి ఇద్దరు విద్యార్థినులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం ముక్పల్ గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం జరిగింది. ఈ ఘటనలో పదవ తరగతి గదిలో పాఠాలు వింటున్న విద్యార్థినులు స్వాతి, హేమరాణిలకు గాయాలయ్యాయి.

ఊడిపడిన పెచ్చులు విద్యార్థినుల తలపై బలంగా పడటంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. వారిని వెంటనే స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఎంఈఓ రాజేశ్వర్ హూటాహూటిన పాఠశాలకు చేరుకొని పరిస్థితిని పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement