
మొండిగోడల మధ్య అఆఇఈ
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కంఠాయపాలెం హైస్కూల్‌లో తరగతి గదులు శిథిలా వస్థకు చేరి పైకప్పు కూలిపోయింది. దీంతో విద్యార్థులు మొండిగోడల మధ్య చదువు కుంటున్నారు. పాఠశాల భవనం కూలి నాలుగేళ్లయినా కొత్త భవనం నిర్మిం చకపోవడంతో చెట్లకిందే విద్యార్థులు పాఠాలు నేర్చుకుంటున్నారు. వర్షం వస్తే ఇంటిబాట పడుతున్నారు. తరగతి గదులు నిర్మిస్తామని స్వయంగా ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి అయిన కడియం శ్రీహరి హామీ ఇచ్చినప్పటికీ అది ఇంకా కార్యరూపం దాల్చడం లేదు. ఇక్కడ పది తరగతి గదులు అవసరం ఉండగా మూడు మాత్రమే ఉన్నాయి.
– తొర్రూరు రూరల్