ప్రభుత్వ స్కూల్‌ని కోళ్లఫారం చేశారు | Students on vacation, headmaster turns classrooms into poultry | Sakshi
Sakshi News home page

సెలవుల్లో ఛీకొట్టేలా హెడ్‌మాస్టర్‌ నిర్వాకం

Published Thu, Jun 15 2017 10:02 AM | Last Updated on Fri, Nov 9 2018 4:45 PM

ప్రభుత్వ స్కూల్‌ని కోళ్లఫారం చేశారు - Sakshi

ప్రభుత్వ స్కూల్‌ని కోళ్లఫారం చేశారు

రాంపూర్‌: ఫర్యాద్‌ అలీ ఖాన్‌ ఓ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వ్యాపారవేత్తగా మారిపోయారు. వేసవి సెలవులకు విద్యార్థులు అలా వెళ్లిపోయారో లేదో వెంటనే ప్రభుత్వ పాఠశాలను కోళ్ల ఫారంగా మార్చేశారు. స్థానికంగా కోళ్ల వ్యాపారం చేసే ఓ వ్యక్తితో అవగాహన చేసుకొని పిల్లల జీవితాలను తీర్చిదిద్దే సరస్వతీ నిలయాన్ని వ్యాపార క్షేత్రంగా మార్చి కోళ్ల కంపు చేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌ జిల్లాలోని దర్శన్‌పూర్‌లో చోటుచేసుకుంది.

ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో వేగంగా స్పందించిన జిల్లా విద్యాధికారులు అతడిపై వేటు వేశారు. అతడిని సస్పెండ్‌ చేసి విచారణకు ఆదేశించారు. ఈ కోళ్ల ఫారంను నడుపుతున్న వ్యక్తి దర్శనపూర్‌ గ్రామంలో గ్రామ ప్రధాన్‌గా పనిచేస్తున్న మహిళ భర్తేనంట. అతడితో డబ్బులకు ఒప్పందం చేసుకొని ఆ ప్రధానోపాధ్యాయుడు ఈ ఘనకార్యం నిర్వహించినట్లు ప్రాథమిక సమాచారం. ఓ వీడియోను రహస్యం‍గా తీసి సోషల్‌ మీడియాలో పెట్టడం వల్ల అది కాస్త బయటకు వచ్చి ఆ హెడ్‌మాస్టర్‌ను పట్టించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement