తూర్పుగోదావరి: పాఠశాలలో చదువుకుంటున్న ఓ విద్యార్థినిపై ఒక కీచక ఉపాధ్యాయుడు అమానుషంగా ప్రవర్తించాడు. వివరాలు....తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలం తెడ్డంగి ఆశ్రమ పాఠశాలలో 8 వ తరగతి చదువుతున్న విద్యార్థినికి అదే పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గర్భ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ విషయాన్ని ఆ విద్యార్థిని డీఈఓకు ఫిర్యాదుచేసింది. దీంతో డీఈఓ ఆ ఉపాధ్యాయున్ని సస్పెండ్ చేశారు.