ప్రత్యేక తరగతులతో బాలికలను లైంగిక వేదించాడు ఓ ప్రధానోపాధ్యాయుడు.
ఇది ఏమి పనయ్యా.. ప్రధానోపాద్యాయ
Mar 29 2017 7:55 PM | Updated on Jul 23 2018 8:49 PM
చెన్నై: పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులతో బాలికలను లైంగిక వేదించాడు ఓ ప్రధానోపాధ్యాయుడు. ఈ ఘటన తమిళనాడులోని నాగపట్టినం జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని గవర్నమెంట్ ఎయిడ్ పాఠశాల్లో హెచ్‌ఎంగా విధులు నిర్వహిస్తున్న మణికందన్ (45) గత కొన్ని రోజులుగా పదో తరగతి పిల్లలకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాడు. తరగతులకు హాజరైన బాలికలను లైంగిక వేదించాడు. ఈ విషయాన్ని విద్యార్థినులు తల్లి తండ్రులకు తెలియజేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
తల్లితండ్రులు మంగళవారం హెచ్‌ఎంపై దాడి చేసి స్కూల్ ముందు ధర్నా చేశారు. పోలీసులకు, ఎమ్మార్వోకు సమాచారం అందడంతో హెచ్‌ఎంను తహశీల్ధార్ సస్పెండ్ చేశారు. పోలీసులు హెచ్‌ఎంను అరెస్టు చేసి నాగపట్టినం మహిళా కోర్టులో హాజరు పరిచగా కస్టడీలోకి తీసుకోవాలని కోర్టు ఆదేశించింది.
Advertisement
Advertisement