మెదక్ జిల్లా చిన్నశంకరంపేట జడ్పీ పాఠశాలలో విద్యార్థులకు త్రుటిలో ప్రమాదం తప్పింది.
మెదక్ జిల్లా చిన్నశంకరంపేట జడ్పీ పాఠశాలలో విద్యార్థులకు త్రుటిలో ప్రమాదం తప్పింది. పాఠశాలలోని ఒక తరగతి గది పైకప్పు పెచ్చులూడి కిందపడ్డాయి. అయితే, ఆసమయంలో విద్యార్థులెవరూ అక్కడ లేకపోవటంతో పెద్ద ప్రమాదం తప్పింది. విషయం తెలిసిన ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటన నేపథ్యంలో ప్రధానోపాధ్యాయుడు పాఠశాలకు సాయంత్రం సెలవు ప్రకటించారు.