రక్షణ కల్పించాలని ప్రేమ జంట వినతి | Love Couple Request To Police On Family Threats In West Godavari | Sakshi
Sakshi News home page

రక్షణ కల్పించాలని ప్రేమ జంట వినతి

Published Mon, May 21 2018 8:44 AM | Last Updated on Tue, Aug 21 2018 9:20 PM

Love Couple Request To Police On Family Threats In West Godavari - Sakshi

పోలీసులకు వినతిపత్రం అందజేస్తున్న ప్రేమ జంట

పశ్చిమ గోదావరి, వీరవాసరం: తమకు రక్షణ కల్పించాలంటూ ప్రేమ జంట ఆదివారం వీరవాసరం పోలీసులకు వినతిపత్రాన్ని అందచేశారు. వీరవాసరం మండలం రాయకుదురు గ్రామానికి చెందిన మట్టా నవీన్‌కుమార్‌ అదే గ్రామానికి చెందిన పిట్టా సుస్మిత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. శనివారం భీమవరం శివారు చిన రంగని పాలెంలో రిజిస్టర్‌ వివాహం చేసుకున్నారు.

అనంతరం ఆదివారం ఉదయం వీరవాసరం పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి సుస్మిత కుటుంబ సభ్యుల నుంచి వేధింపులు ఉన్నాయని, వారి నుంచి మాకు రక్షణ కల్పించాలంటూ పోలీసులను ఆశ్రయించారు. ఇరువర్గాల కుటుంబ సభ్యులను స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్‌ నిర్వహించి వివాదాలు పెట్టుకోవద్దని నచ్చచెబుతామని ఎస్సై ఎన్‌.శ్రీనివాసరావు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement