
కొణిదెల హీరో పవన్ తేజ్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. నటి, యాంకర్ మేఘన మెడలో మూడుముళ్లు వేయనున్నాడు. బుధవారం ఇరుకుటుంబాల సమక్షంలో వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ ఎంగేజ్‌మెంట్ వేడుకకు చిరంజీవి సతీమణి సురేఖ, నటుడు సాయిధరమ్ తేజ్ సహా తదితరులు హాజరయ్యారు. తన ఎంగేజ్‌మెంట్ ఫొటోను పవన్‌తేజ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. 'నేను ఆమెను ప్రేమిస్తున్నాను, నాకు ప్రేమ అంటే ఏంటో ఆమె వల్లే తెలిసింది. మా ఇద్దరి ప్రయాణం ఇప్పుడే మొదలైంది అని' రాసుకొచ్చాడు. అటు మేఘన కూడా.. 'నా ప్రేమను కనుగొన్నాను, అతడితో నిశ్చితార్థం కూడా జరిగింది. ఇప్పుడు నా మనసు గాల్లో తేలుతోంది, కానీ నా చేతులు బరువెక్కుతున్నాయి. ఇక నా జీవితం అంతా నీకే సొంతం' అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది.
కాగా పవన్ తేజ్‌కు.. మెగాస్టార్ చిరంజీవి బాబాయ్ అవుతాడు. ఈ కథలో పాత్రలు కల్పితం సినిమాతో హీరోగా ఆకట్టుకున్నాడు పవన్. ఇందులో హీరోయిన్‌గా మేఘన నటించింది. ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే వీరిద్దరూ లవ్‌లో పడ్డట్లు తెలుస్తోంది. వీరి ప్రేమకు ఇరు కుటుంబాలు పచ్చజెండా ఊపడంతో త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్నారు. కాగా పవన్ తేజ నటుడిగా రాణించేందుకు ప్రయత్నిస్తుండగా మేఘన బుల్లితెర షో యాంకర్‌గా అలరిస్తోంది.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
చదవండి: తాప్సీ మూవీని నిషేధించి, గుణపాఠం చెప్దామంటున్న నెటిజన్లు
ఘనంగా ప్రముఖ సీరియల్ నటి సీమంతం, ఫొటోలు వైరల్
Comments
Please login to add a commentAdd a comment