మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ తన అన్న అల్లు అరవింద్ ఇంటికి వెళ్లారు. తన మేనల్లుడు అయిన అల్లు అర్జున్‌ను ఆమె కలిశారు. బన్నీని చూసిన వెంటనే హత్తుకుని ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ అయిన వెంటనే చిరంజీవి, సురేఖ ఇద్దరూ బన్నీ ఇంటికి వెళ్లి పరామర్శించిన విషయం తెలిసిందే. బెయిల్ ద్వారా అల్లు అర్జున్ ఇంటికి రావడంతో తన మేనల్లుడి కోసం సురేఖ మరోసారి అక్కడకు వచ్చారు.
పుష్ప–2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా ఈ నెల 4న ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. నాంపల్లి హైకోర్టులో వాదనలు, రిమాండ్ విధింపు, చంచల్‌గూడ జైలుకు తరలింపు అంతా నాటకీయ పరిణామాల మధ్య జరిగిపోయాయి. అదే సమయంలో హైకోర్టులో క్వాష్ పిటిషన్, బెయిల్ పిటిషన్లపై వాదనలు, సాయంత్రమే హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసినా.. రాత్రి వరకు కాపీ అందకపోవడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
దీంతో నిన్న రాత్రంతా ఆయన చంచల్‌గూడ జైలులో ఉన్నారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో శనివారం ఉదయం బన్నీ బయటకు వచ్చారు. టాలీవుడ్‌కు చెందిన సినీ ప్రముఖులు చాలామంది అల్లు అర్జున్ ఇంటికి వెళ్తున్నారు. ఇప్పటికే విజయ్ దేవరకొండ, కొరటాల శివ, సుకుమార్, శ్రీకాంత్, దిల్ రాజు, ఆర్ నారాయణమూర్తి, రానా, నాగచైతన్య, వంశీ పైడిపల్లి,హరీష్ శంకర్ వంటి స్టార్స్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment