ఆ సినిమా కోసమే ఆ లుక్‌! | Chiranjeevi confirms that Ram Charan plays a key role in Acharya | Sakshi
Sakshi News home page

ఆ సినిమా కోసమే ఆ లుక్‌!

Published Fri, Sep 25 2020 1:27 AM | Last Updated on Fri, Sep 25 2020 5:16 AM

Chiranjeevi confirms that Ram Charan plays a key role in Acharya - Sakshi

‘చరణ్, నేను కలసి నటించాలన్నది నా భార్య సురేఖ కోరిక. ‘ఆచార్య’తో అది నెరవేరుతోంది’ అన్నారు చిరంజీవి. ఇటీవల ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ ఆయన తన తదుపరి సినిమాలకు సంబంధించిన పలు విశేషాలు పంచుకున్నారు. ఆ వివరాలు ఈ విధంగా... ‘‘ఆచార్య’ సినిమాలో నాకు, చరణ్‌కి కలసి నటించే అవకాశం లభించింది. మళ్లీ ఇలాంటి కథ దొరుకుతుందో లేదో అని ఆ పాత్రలో చరణ్‌ నటిస్తే బావుంటుంది అనుకున్నాం. ప్రస్తుతం చరణ్‌ రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చేస్తున్నాడు.

అందుకని ‘ఆచార్య’ కోసం రాజమౌళిని రిక్వెస్ట్‌ చేసి చరణ్‌ డేట్స్‌ అడ్జెస్ట్‌ చేశాం. ‘ఆచార్య’ వచ్చే ఏప్రిల్‌కి పూర్తవుతుంది. ఆ తర్వాత వీవీ వినాయక్‌ దర్శకత్వంలో ‘లూసిఫర్‌’ (మలయాళం)  రీమేక్, మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో ‘వేదాళం’ (తమిళం) రీమేక్‌లో నటిస్తాను. ఈ మధ్య ట్రై చేసిన గుండు లుక్‌ ‘వేదాళం’ కోసమే. కానీ ఆ లుక్‌ ఇంకా ఫైనలైజ్‌ కాలేదు. ఇక నుంచి ఏడాదికి రెండు, మూడు సినిమాలు చేయాలనుకుంటున్నాను. వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకులు ఎప్పటిలానే థియేటర్స్‌కు వస్తారనుకుంటున్నాను’’ అని అన్నారు చిరంజీవి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement