
సాక్షి, హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి ఇటీవల సోషల్ మీడియలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. కొంచెం ఆలస్యంగా సోషల్ మీడియాలోకి అడుగుపెట్టినా.. చాలా యాక్టివ్‌గా ఉంటున్నాడు. తనకు సబంధించిన పలు విషయాలను అభిమానులతో పంచుకుంటున్నాడు. అంతే కాదు సమాజంలో జరిగే సంఘటనపై కూడా తనదైన శైలీలో స్పందిస్తున్నాడు. తాజాగా తన భార్య సురేఖతో ఉన్న ఓ ఫోటోను అభిమానులతో పంచుకుంటూ ‘కాలం మారినా.. దేశం మారినా.. సురేఖ, తాను మాత్రం ఏమీ మారలేదు’ అని చిరంజీవి పేర్కోన్నాడు. (చదవండి : ఒకేసారి ఆ మార్క్‌ను అందుకున్న చిరు, చరణ్)
1990లో అమెరికా వెళ్లినపుడు అక్కడ వంట చేస్తున్న ఫొటోను, ప్రస్తుతం సొంతింట్లో వంట చేస్తున్న ఫొటోను చిరంజీవి ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్ చేశారు. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఆ రెండు ఫోటోల్లోనూ ఇద్దరు ఒకే రంగు దుస్తులు ధరించి, ఒకే స్టైల్లో నిల్చుని ఉన్నారు. 1990 ఫొటోకు `జాయ్‌ఫుల్ హాలీడే ఇన్ అమెరికా` అని క్యాప్షన్ ఇవ్వగా.. 2020 ఫొటోకు `జైల్‌ఫుల్ హాలీడే ఇన్ కరోనా` అని క్యాప్షన్ ఇచ్చి అలా ప్రాసతో అదరగొట్టాడు. ఇక చిరంజీవి, సురేఖల ఫోటోలు చూసి మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment