
బెంగళూరు : ప్రముఖ శాండల్‌వుడ్ నటి సురేఖ (66) ఆదివారం గుండెపోటుతో మృతి చెందారు. టీవీ చూస్తుండగా రాత్రి 9.30 నిమిషాలకు ఆమెకు గుండెపోటు వచ్చిందని కుటుంబ వర్గాలు తెలిపాయి. దీంతో వెంటనే ఆమెను సమీప ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు. సురేఖ అంత్యక్రియలు బెంగళూరులోని ఆదివారం బనశంకరి శ్మశానవాటికలో జరిగాయి.
ఇక నటుడు రాజ్‌కుమార్‌తో కలిసి త్రిమూర్తి, ఒలావు గెలువు, గిరి కాన్యే, సాక్షత్క వంటి పలు సినిమాల్లో నటించింది. భరతనాట్యంలో శిక్షణ తీసుకొని దేశ, విదేశాల్లో పలు నాట్య ప్రదర్శనలు ఇచ్చింది. ముఖ్యంగా మహిళా ప్రాధాన్యమున్న పాత్రలు పోషించి శాండల్‌వుడ్‌లో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇప్పటివరకు ఆమె కెరీర్‌లో 150కి పైగా సినిమాల్లో నటించింది.
చదవండి : నటుడు అటల్ బిహారి పండా ఇక లేరు
Comments
Please login to add a commentAdd a comment