Surekha Konidela Birthday: Ram Charan Shares Emotional Post About His Mother - Sakshi
Sakshi News home page

అమ్మ పుట్టినరోజు.. రామ్‌ చరణ్‌ ఎమోషనల్‌ పోస్ట్‌

Feb 19 2021 1:20 PM | Updated on Feb 19 2021 3:21 PM

Ram Charan Wishes Mom Surekha On Her Birthday - Sakshi

మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ గురువారం(ఫిబ్రవరి18) పుట్టినరోజు జరుపుకున్నారు ఈ సందర్భంగా టాలీవుడ్‌ ఇండస్ట్రీ నుంచి ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. తల్లి పుట్టిన రోజును పురస్కరించుకొని మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ పుట్టినరోజు ప్రత్యేక శుభాంకాంక్షలు తెలిపారు  చిరంజీవి, సురేఖ‌ల ముద్దుల త‌న‌యుడు రామ్ చ‌రణ్ తాజాగా త‌న సోష‌ల్ మీడియాలో త‌ల్లితో దిగిన ఫొటో షేర్ చేస్తూ బ‌ర్త్‌డే శుభాకాంక్ష‌లు తెలియ‌జేశాడు. ‘నీ అమిత‌మైన ప్రేమ‌కు కృత‌జ్ఞ‌త‌లు. అమ్మ నీకు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు ’అని ట్వీట్ చేశాడు. అలాగే ఇన్‌స్టాలో నా మొదటి ప్రేమకు పుట్టిన రోజు శుభాకాంక్షలు, లవ్‌ యూ అమ్మ అంటూ పోస్టు చేశాడు.

చ‌ర‌ణ్ చేసిన ట్వీట్ నెటిజ‌న్స్‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. తల్లి,కొడుకులు దిగినఫోటోను చూసి మెగా అభిమానులు సంబరపడుతున్నారు.  మరోవైపు చరణ్‌ స్నేహితుడు, హీరో రానా కూడా సురేఖకు బర్త్‌డే విషెస్‌ తెలిపాడు. హ్యపీ బర్త్‌డే సురేఖ ఆంటీ అని పేర్కొన్నాడు. ఇక సినిమాల విషయానికొస్తే చిరంజీవి-రామ్ చ‌ర‌ణ్ క‌లిసి న‌టిస్తున్న ఆచార్య చిత్రానికి సురేఖ సమర్పకురాలిగా వ్యవహరిస్తుండగా మ్యాట్నీ మూవీస్ - కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై నిరంజన్ రెడ్డి - చరణ్ కలిసి నిర్మిస్తున్నారు  ప్ర‌స్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాతో పాటు ఆచార్య చిత్రంతో రామ్‌ చరణ్‌ బిజీగా ఉన్నాడు. అదే విధంగా త్వ‌ర‌లో శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ మూవీ చేయ‌నున్నాడు. ఇటీవ‌ల ఈ మూవీకి సంబంధించి అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న కూడా చేసిన విషయం తెలిసిందే.
చదవండి: రామ్‌ చరణ్‌ రికార్డులను తుడిచిపెట్టిన ‘ఉప్పెన’..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement