
Surekha Konidela Opened An Account In Twitter: సోషల్ మీడియాలో అనేకమంది తారలు యాక్టివ్‌గా ఉంటారు. తమకు సంబంధించిన మూవీ అప్డేట్స్, సరదా సన్నివేశాలు, మోస్ట్ మెమొరబుల్ థింగ్స్‌ను అభిమానులతో పంచుకుంటారు. నెటిజన్లు, ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్ అయ్యేందుకు ఒక మంచి ప్లాట్‌ఫామ్ సోషల్ మీడియా. ఇటీవల ప్రతీ ఒక్కరూ సామాజిక మాధ్యమాల్లో ఖాతాలు తెరుస్తున్నారు. ఇటీవలే బాలీవుడ్ నిర్మాత, అతిలోక సుందరి శ్రీదేవి భర్త బోనీ కపూర్ ఇన్‌స్టా గ్రామ్ అకౌంట్ ఓపెన్ చేశారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ కొణిదెల సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చారు.
ట్విటర్లో అడుగుపెట్టిన సురేఖ కొణిదెల తన ఫస్ట్ పోస్ట్‌ను షేర్ చేశారు. రామ్ చరణ్‌తో దిగిన ఫొటోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. నా సూపర్ స్టైలిష్ కొడుకుతో నా మొదటి పోస్ట్‌తో ట్విటర్లో చేరినందుకు సంతోషంగా ఉంది అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా మార్చి 25న విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే చిరంజీవి ఆచార్య ఏప్రిల్ 29న రిలీజ్ కానుండగా గాడ్ ఫాదర్, భోళా శంకర్ సినిమాలతో బిజీగా ఉన్నారు.
Happy To Join On Twitter My First Post With Super Stylish Son @AlwaysRamCharan #RamCharan #RamCharan𓃵 #RRR. pic.twitter.com/BviB9PnvGP
— Surekha Konidala (@SurekhaKonidala) February 26, 2022