వరంగల్ టీఆర్‌ఎస్‌లో స్తబ్దత | TRS stagnation in Warangal | Sakshi
Sakshi News home page

వరంగల్ టీఆర్‌ఎస్‌లో స్తబ్దత

Published Wed, Dec 17 2014 3:08 AM | Last Updated on Sat, Sep 2 2017 6:16 PM

వరంగల్ టీఆర్‌ఎస్‌లో స్తబ్దత

వరంగల్ టీఆర్‌ఎస్‌లో స్తబ్దత

సురేఖకు వ్యతిరేకంగా మెజారిటీ ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీ, నామినేటెడ్ భర్తీ తర్వాత కొత్త సమీకరణలు

 
సాక్షిప్రతినిధి, వరంగల్: తెలంగాణ ఉద్యమానికి ఆయుపట్టుగా నిలిచిన వరంగల్ జిల్లాలో మంత్రివర్గ విస్తరణలో అనుకోని స్తబ్దత నెలకొంది. నిన్నటి వరకు పదవి ఎవరిని వరిస్తుందోనన్న ఉత్కంఠ ఉండగా, సీనియర్ నేత ములుగు ఎమ్మెల్యే అజ్మీరా చందులాల్ మంగళవారం మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. దీంతో పదవి వచ్చినవారు, ఆశించి భంగపడిన వారు గుంభనంగానే ఉంటున్నారు. చందులాల్ 1989లో ఎన్టీఆర్ మంత్రివర్గంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పని చేశారు. చందులాల్‌కు రాజకీయంగా మొదటి నుంచీ వివాదరహితుడిగా పేరుంది. ఎలాంటి పదవి వచ్చినా తన నియోజకవర్గానికే పరిమితమవుతాడనే అభిప్రాయ మూ ఉంది.

చందులాల్‌కు మంత్రి పదవి విషయంలో జిల్లాలోని పార్టీ ఎమ్మెల్యేలంతా ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయానికే కట్టుబడతామని చెప్పినట్లు తెలిసింది. టీఆర్‌ఎస్‌కు చెందిన గిరిజన ఎమ్మెల్యేల్లో సీనియర్ కావడం, రాజకీయంగా కేసీఆర్ సమకాలికుడు కావడం మంత్రి పదవి వచ్చే విషయంలో చందులాల్‌కు అనుకూల అంశాలు పని చేశాయి. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ మంత్రి పదవిపై చివరికి వరకు ఆశలు పెట్టుకున్నారు. మహిళా ఎమ్మెల్యే కోటాలో అయినా ఆమెకు కేబినెట్ బెర్త్ దక్కుతుందని భావించారు. జిల్లాలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు సురేఖకు పదవి అంశంలో సీఎం కేసీఆర్ వద్ద వ్యతిరేకత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

దీంతో ఎమ్మె ల్యే సురేఖ భర్త కొండా మురళీధర్‌రావుకు త్వరలో ఎన్నికలు జరగనున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశం కల్పిస్తారని కేసీఆర్ హామీ ఇచ్చినట్లు సమాచారం. టీఆర్‌ఎస్‌లో చేరే సమయంలో సురేఖకు మంత్రి పదవిపై కేసీఆర్ హామీ ఇచ్చినట్లు ‘కొండా’ వర్గీయు లు చెబుతున్నారు. జిల్లా నుంచి వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా, డిప్యూటీ సీఎంగా ఉన్న టి. రాజయ్య గానీ, కొత్తగా ప్రమాణ స్వీకారం చేసి న చందులాల్ గానీ ఇతర నియోజకవర్గాల్లో జో క్యం చేసుకోరనే పేరుంది. ఈ క్రమంలో టీఆర్‌ఎస్‌లో రాజకీయంగా గ్రూపులు, వర్గాలకు ఇప్పటికిప్పుడు ఆస్కారం కనిపించడం లేదు. ఎమ్మె ల్సీ, నామినేటెడ్ పదవుల పంపకాల తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.

ఓరుగల్లుకు ప్రాధాన్యం..
తెలంగాణ ఆవిర్భావం తర్వాత టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో వరంగల్ జిల్లాకు రాజకీయంగా ప్రాధాన్యం దక్కింది. స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే టి. రాజయ్య డిప్యూటీ సీఎం ఉన్నారు. భూపాలపల్లి ఎమ్మెల్యే మధుసూదనచారి తొలి శాసనసభ స్పీకర్‌గా ఉన్నారు. జిల్లాకు చెందిన ఇద్దరు రిటై ర్డ్ ఐఏఎస్ అధికారులు బి.రామచంద్రుడు ఢిల్లీలో రాష్ర్ట ప్రభుత్వ  ప్రతినిధి పదవి, బి.వి. పాపారావుకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పదవులు దక్కాయి. చందులాల్‌కు మంత్రి పదవి దక్కింది. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్‌కు సహాయ మంత్రి హోదా కలిగిన పార్లమెంట్ కార్యదర్శి పదవి వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement