Ajmer Chandulal
-
ఆదివాసీల చిత్రకళకు ఊపిరి
సాక్షి, హైదరాబాద్: ఆదివాసీ తెగల సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చాటేందుకు గిరిజన సంక్షేమ శాఖ చిత్రకళను పునరుద్ధరిస్తోంది. ఇందులో భాగంగా ఆదివాసీ తెగల్లోని ఔత్సాహిక చిత్రకారులను ప్రోత్సహిస్తోంది. గత ఆర్నెళ్లుగా ఆదివాసీ తెగలకు చెందిన గోండు, కొలామీ, బంజార, కోయ వర్గాలకు చెందిన యువతను ఎంపిక చేసి పలు రకాల శిక్షణ కార్యక్రమాలు నిర్వహించింది. తాజాగా ఈ చిత్రకారులు వేసిన చిత్రాలతో గురువారం మాసబ్‌ట్యాంక్‌లోని సెంటినరీ మ్యూజియం ఆవరణలో ప్రదర్శన ఏర్పాటు చేసింది. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ ఈ ప్రదర్శనను ప్రారంభించారు. ఇందు లో దాదాపు 50కి పైగా చిత్రాలను ఔత్సాహిక చిత్రకారులు ప్రదర్శించారు. ప్రతి ఆదివాసీ తెగకున్న ప్రత్యేకతను వెలుగులోకి తెచ్చేందుకు గిరిజన సంక్షేమ శాఖ చిత్రకళ పునరుద్ధరణకు ఉపక్రమించింది. దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాల్లో ని గిరిజనులు, ఆదివాసీల సంస్కృతికి సంబంధించి చిత్రకళ అందుబాటులో ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణలోని ఆదివాసీ, గిరిజనుల సంస్కృతిని చిత్రాల రూపంలో అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టింది. ప్రతి కార్యాలయంలో పెయింటింగ్స్ ఆదివాసీ చిత్రకారుల చిత్రాలను ప్రతి ప్రభు త్వ కార్యాలయంలో ఉండేలా గిరిజన సంక్షేమ శాఖ నిర్ణయించింది. దీంతో చిత్రకారులకు మంచి ఉపాధి లభించనుంది. ఇకపై రాష్ట్ర, జిల్లా కార్యాలయాల్లో ఆదివాసీ చిత్రాలు కనిపించనున్నాయి. ప్రైవేటువ్యక్తులు సైతం వీటిని కొనేందుకు వీలుగా ప్రత్యేకంగా ఎగ్జిబిషన్ల కోసం ఏర్పాట్లు చేస్తోంది. డిమాండ్‌కు తగినట్లు ఔత్సాహిక చిత్రకారులకు సామగ్రిని యంత్రాంగం సరఫరా చేస్తోంది. -
8న బతుకమ్మ మహాప్రదర్శన
భారీ ఏర్పాట్లు చేయండి గిన్నిస్‌బుక్ రికార్డు సాధించాలి మంత్రి అజ్మీరా చందూలాల్ ఆదేశం జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ సంగారెడ్డి జోన్: బతుకమ్మ సంబరాల్లో భాగంగా అక్టోబర్ 8న అన్ని జిల్లాల్లో బతుకమ్మ çమహా ప్రదర్శనను వైభవంగా నిర్వహించాలని రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ ఆదేశించారు. శుక్రవారం ఆయన హైదరాబాద్ నుంచి ఆ శాఖ కార్యదర్శి బి.వెంకటేశం, ప్రభుత్వ సలహాదారులు కేవీ రమణాచారి, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్‌తో కలిసి కలెక్టర్లు, అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బతుకమ్మ సంబరాలు శుక్రవారం మొదలైనట్టు చెప్పారు. 8వ తేదీన హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఎనిమిది వేల మంది మహిళలతో బతుకమ్మ మహా ప్రదర్శన నిర్వహిస్తున్నామన్నారు. ఈ ప్రదర్శనకు గిన్నిస్ బుక్‌లో స్థానం లభించేలా విస్తృత ప్రచారం కల్పిస్తున్నామన్నారు. మహిళలు స్వచ్ఛందంగా పాల్గొనేలా ప్రోత్సహించి అందుకోసం ఏర్పాట్లు చేయాలని సూచించారు. హైదరాబాద్ తరహాలోనే జిల్లాల్లోనూ 8వ తేదీన మహా ప్రదర్శనను వెయ్యి మంది మహిళలకు తక్కువ కాకుండా నిర్వహించాలన్నారు. తెలంగాణలో పుట్టిన పూల పండగకు అంతర్జాతీయ ఖ్యాతి తీసుకురావాలన్న ధ్రుడ సంకల్పంతో ప్రభుత్వం ఉందన్నారు. 9న సద్దుల బతుకమ్మ నిర్వహణకు ఊరూరా ఏర్పాట్లు చేయాలన్నారు. నీటితో చెరువులు నిండినందున భారీ క్రేన్లు, లైటింగ్, తాగునీరు తదితర సౌకర్యాలు కల్పించాలన్నారు. ఇందుకోసం పాత జిల్లాలకు రూ.10 లక్షల చొప్పున, కొత్త జిల్లాలకు రూ.5 లక్షల చొప్పున నిధులు కలెక్టర్లకు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. మహా ప్రదర్శన, సద్దుల బతుకమ్మ, ఇతర సంబరాలు ఘనంగా నిర్వహించటంలో విశేషంగా కృషి చేసిన జిల్లాలకు నగదు పారితోషికం అందజేస్తామని వెల్లడించారు. మొదటి బహుమతి కింద రూ. 5 లక్షలు, రెండో బహుమతి కింద రూ.3 లక్షలు, మూడో బహుమతి కింద రూ.2 లక్షలు అందజేస్తామన్నారు. జిల్లా తరఫున కలెక్టర్ రోనాల్డ్‌రోస్, జేసీ వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో 8, 9వ తేదీల్లో బతుకమ్మ పండగను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. కలెక్టరేట్ నుంచి డీఆర్డీఏ పీడీ సత్యనారాయణరెడ్డి, ఐసీడీఎస్ పీడీ మోతె, సమాచార పౌర సంబంధాల అధికారి శ్రీనివాస్‌తో పాటు వివిధ శాఖల అధికారలు పాల్గొన్నారు. -
నేడు మేడారంలో మంత్రుల పర్యటన
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందిన సమ్మక్క సారక్క జాతర ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్న సందర్భంగా.. ప్రభుత్వం ఏర్పాట్లపై దృష్టి సారించింది. తెలంగాణ వచ్చాక జరుగుతున్న తొలి జాతర కావడంతో అంగరంగ వైభవంగా జాతరను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ మేడారంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించనున్నారు. -
వరంగల్ టీఆర్ఎస్లో స్తబ్దత
సురేఖకు వ్యతిరేకంగా మెజారిటీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ, నామినేటెడ్ భర్తీ తర్వాత కొత్త సమీకరణలు సాక్షిప్రతినిధి, వరంగల్: తెలంగాణ ఉద్యమానికి ఆయుపట్టుగా నిలిచిన వరంగల్ జిల్లాలో మంత్రివర్గ విస్తరణలో అనుకోని స్తబ్దత నెలకొంది. నిన్నటి వరకు పదవి ఎవరిని వరిస్తుందోనన్న ఉత్కంఠ ఉండగా, సీనియర్ నేత ములుగు ఎమ్మెల్యే అజ్మీరా చందులాల్ మంగళవారం మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. దీంతో పదవి వచ్చినవారు, ఆశించి భంగపడిన వారు గుంభనంగానే ఉంటున్నారు. చందులాల్ 1989లో ఎన్టీఆర్ మంత్రివర్గంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పని చేశారు. చందులాల్‌కు రాజకీయంగా మొదటి నుంచీ వివాదరహితుడిగా పేరుంది. ఎలాంటి పదవి వచ్చినా తన నియోజకవర్గానికే పరిమితమవుతాడనే అభిప్రాయ మూ ఉంది. చందులాల్‌కు మంత్రి పదవి విషయంలో జిల్లాలోని పార్టీ ఎమ్మెల్యేలంతా ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయానికే కట్టుబడతామని చెప్పినట్లు తెలిసింది. టీఆర్ఎస్కు చెందిన గిరిజన ఎమ్మెల్యేల్లో సీనియర్ కావడం, రాజకీయంగా కేసీఆర్ సమకాలికుడు కావడం మంత్రి పదవి వచ్చే విషయంలో చందులాల్‌కు అనుకూల అంశాలు పని చేశాయి. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ మంత్రి పదవిపై చివరికి వరకు ఆశలు పెట్టుకున్నారు. మహిళా ఎమ్మెల్యే కోటాలో అయినా ఆమెకు కేబినెట్ బెర్త్ దక్కుతుందని భావించారు. జిల్లాలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు సురేఖకు పదవి అంశంలో సీఎం కేసీఆర్ వద్ద వ్యతిరేకత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఎమ్మె ల్యే సురేఖ భర్త కొండా మురళీధర్‌రావుకు త్వరలో ఎన్నికలు జరగనున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశం కల్పిస్తారని కేసీఆర్ హామీ ఇచ్చినట్లు సమాచారం. టీఆర్ఎస్లో చేరే సమయంలో సురేఖకు మంత్రి పదవిపై కేసీఆర్ హామీ ఇచ్చినట్లు ‘కొండా’ వర్గీయు లు చెబుతున్నారు. జిల్లా నుంచి వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా, డిప్యూటీ సీఎంగా ఉన్న టి. రాజయ్య గానీ, కొత్తగా ప్రమాణ స్వీకారం చేసి న చందులాల్ గానీ ఇతర నియోజకవర్గాల్లో జో క్యం చేసుకోరనే పేరుంది. ఈ క్రమంలో టీఆర్ఎస్లో రాజకీయంగా గ్రూపులు, వర్గాలకు ఇప్పటికిప్పుడు ఆస్కారం కనిపించడం లేదు. ఎమ్మె ల్సీ, నామినేటెడ్ పదవుల పంపకాల తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే. ఓరుగల్లుకు ప్రాధాన్యం.. తెలంగాణ ఆవిర్భావం తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వంలో వరంగల్ జిల్లాకు రాజకీయంగా ప్రాధాన్యం దక్కింది. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే టి. రాజయ్య డిప్యూటీ సీఎం ఉన్నారు. భూపాలపల్లి ఎమ్మెల్యే మధుసూదనచారి తొలి శాసనసభ స్పీకర్‌గా ఉన్నారు. జిల్లాకు చెందిన ఇద్దరు రిటై ర్డ్ ఐఏఎస్ అధికారులు బి.రామచంద్రుడు ఢిల్లీలో రాష్ర్ట ప్రభుత్వ ప్రతినిధి పదవి, బి.వి. పాపారావుకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పదవులు దక్కాయి. చందులాల్‌కు మంత్రి పదవి దక్కింది. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్కు సహాయ మంత్రి హోదా కలిగిన పార్లమెంట్ కార్యదర్శి పదవి వచ్చింది.