
సాక్షి, యాదాద్రి: మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ శుక్రవారం యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అక్టోబర్ 2వ తేదీన చిరంజీవి నటించిన ‘సైరా’ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో సినిమా పెద్ద హిట్ కావాలని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సురేఖకు...ఆలయ అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. కాగా చిరంజీవి హీరోగా తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించగా, రామ్ చరణ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఇప్పటికే సినిమా సెన్సార్ కూడా పూర్తయింది.
చదవండి: నా జీవితంలో ఇదొక అద్భుతమైన రోజు : చిరంజీవి
Comments
Please login to add a commentAdd a comment