రాయదుర్గం(హైదరాబాద్): మహిళలు కుటుంబాన్ని చాలా ప్రభావితం చేస్తారని, కుటుంబ మనుగడలో వీరి పాత్ర కీలకమని హీరో రాంచరణ్ సతీమణి ఉపాసన అన్నారు. నాలెడ్జి సిటీలోని టి–హబ్‌లో ట్రంఫ్ ఆఫ్ టాలెంట్ హౌజ్ ఆఫ్ మేకప్ ఆధ్వర్యంలో వివిధ రంగాలలో రాణించిన మహిళలకు విమెన్ ఆఫ్ ఇంపాక్ట్ అవార్డుల పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం రాత్రి నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘మా అత్తమ్మ ఎంతో ప్రేమగల వ్యక్తి..ఆమే నాకు స్ఫూర్తి’ అని చెప్పారు. ప్రధానంగా నేడు ధైర్యంగా, ధృఢంగా ఉండే మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపేందుకే ఈ అవార్డుల కార్యక్రమానికి వచ్చానన్నారు. ఎలికో లిమిటెడ్ వైస్ చైర్‌పర్సన్ వనితా దాట్ల మహిళలు అన్ని రంగాల్లో రాణించడం ఎంతో అవసరమన్నారు. కార్యక్రమంలో టి–హబ్ సీఈఓ ఎంశ్రీనివాసరావు, హెచ్‌ఎస్‌బీసీ ఎండీ మమతా మాదిరెడ్డి, పూర్వవిద్యార్థుల సంఘం కో¸ûండర్ ఆదితి ఆర్య కోటక్, శిల్పారెడ్డి ప్రసంగించారు.
Comments
Please login to add a commentAdd a comment