
షాంఘై: ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–1 టోర్నమెంట్‌లో భారత్‌కు ఏకైక కాంస్య పతకం లభించింది. కాంపౌండ్ మిక్స్‌డ్ ఈవెంట్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ–అభిషేక్ వర్మ జోడీ మూడో స్థానంలో నిలిచింది. శనివారం జరిగిన కాంస్య పతక పోరులో సురేఖ–అభిషేక్ ద్వయం 154–148తో యాసిమ్ బోస్టాన్–దెమిర్ ఎల్మాగాక్లి (టర్కీ) జోడీపై విజయం సాధించింది. మరోవైపు కాంపౌండ్ టీమ్ ఈవెంట్‌లో భారత జట్లకు నిరాశ ఎదురైంది.
కాంస్య పతక మ్యాచ్‌ల్లో జ్యోతి సురేఖ, మధుమిత, ముస్కాన్‌లతో కూడిన భారత మహిళల జట్టు 221–223తో నెదర్లాండ్స్ చేతిలో... అభిషేక్ వర్మ, చిన్నరాజు శ్రీధర్, రజత్ చౌహాన్‌లతో కూడిన భారత పురుషుల జట్టు 232–234తో ఫ్రాన్స్ జట్టు చేతిలో ఓడిపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment