
మ్యాథ్స్‌లో వరల్డ్ టాపర్ హైదరాబాదీ
హైదరాబాద్: హైదరాబాదీ బాలుడు రిషికేశ్‌రెడ్డి కాయతి అద్భుతం సాధించాడు. నగరంలోని ఓక్‌రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఐన్‌స్టీన్ క్యాంపస్ విద్యార్థి అయిన ఈ బాలుడు మాథ్స్‌లో వరల్డ్ టాపర్‌గా నిలిచాడు. ఇంటర్నేషనల్ జనరల్ సర్టిఫికెట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (ఐజీసీఎస్‌ఈ) మే నెలలో నిర్వహించిన పదో తరగతి మ్యాథ్స్‌లో రిషికేశ్‌రెడ్డి వందశాతం మార్కులు సాధించాడు. తమ ఉపాధ్యాయుల కృషితో పాటు అంకితభావంతో చదవడం వల్ల రిషికేశ్‌రెడ్డి ఈ ఘనవిజయాన్ని సొంతం చేసుకోగలిగాడని ప్రిన్సిపాల్ జ్యోతిరెడ్డి, స్కూల్ డెరైక్టర్ మానస్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు.