Oakridge International School
-
ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో బబుల్గమ్ చిత్ర యూనిట్ సందడి
-
కేటీఆర్ కుమారుడికి గోల్డ్ మెడల్
హైదరాబాద్: డీహెచ్ఎఫ్ఎల్ ప్రమెరికా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ సంస్థ నిర్వహించిన బెహతర్ ఇండియా క్యాంపెయిన్ పర్యావరణ విభాగంలో హైదరాబాద్ ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థి బంగారు పతకం సాధించాడు. ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాన్షురావు వ్యక్తిగత విభాగంలో 29,482 కిలోల రీసైకిలబుల్ వేస్ట్ సేకరించి అగ్రస్థానంలో నిలిచాడు. పాఠశాల విభాగంలోనూ ఖాజాగూడలోని ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ 34,137 కిలోల రీసైకిలబుల్ వేస్ట్‌ను సేకరించి మూడో స్థానంలో నిలిచింది. బెహతర్ ఇండియా క్యాంపెయిన్ గ్రాండ్ ఫినాలే సందర్భంగా గురువారం ఢిల్లీలో క్యాంపెయిన్ బ్రాండ్ అంబాసిడర్, సినీ నటి పరిణితీ చోప్రా చేతుల మీదుగా పతకాలను ప్రదానం చేశారు. ఓక్రిడ్జ్ పాఠశాల యాజమాన్యాన్ని, వ్యక్తిగత విభాగంలో పతకం సాధించిన హిమాన్షును డీహెచ్ఎఫ్ఎల్ ప్రమెరికా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఎండీ అనూప్ పెబ్బీ అభినందించారు. పాఠశాల ప్రిన్సిపాల్ అర్జున్‌రావు మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో ఓక్రిడ్జ్ పాఠశాలకు బెహతర్ ఇండియా కార్యక్రమంలో రెండు పతకాలు రావడం సంతోషంగా ఉందన్నారు. -
చదువు..నైపుణ్యం.. విలువలకు కేరాఫ్ ఓక్రిడ్జ్
దాదాపు రెండు దశాబ్దాల క్రితం.. ఇద్దరు స్నేహితులు కలసి అప్పటి వరకూ ఉన్న బట్టీ విద్యా విధానానికి ప్రత్యామ్నాయంగా.. విలువలతో కూడిన నాణ్యమైన విద్య అందించాలనే సదాశయంతో వికాస్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్ అనే ఓ చిన్న మొక్కను నాటారు. ఆ మొక్క కాస్తా ఇప్పుడు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ అనే మహావృక్షంగా మారింది. దాని నీడలో ఇప్పుడు వేలాది మంది అత్యున్నతమైన విద్యను అభ్యసిస్తూ.. బంగారు భవితకు బాటలు వేసుకుంటున్నారు.. ఆ ఇద్దరు స్నేహితులే నూజివీడుకు చెందిన తుమ్మల నాగప్రసాద్, యార్లగడ్డ రాజశేఖర్‌బాబు. వికాస్ ఇన్స్టిట్యూషన్స్, ఓక్రిడ్జ్ పాఠశాలలు, వెస్ట్‌బెర్రీ పాఠశాలలన్నింటికీ మాతృ సంస్థ పీపుల్ కంబైన్ 2010లో ఆవిర్భవించింది. ‘వికాస్ ఇన్స్టిట్యూషన్స్’ నెలకొల్పి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అన్ని ఓక్రిడ్జ్ పాఠశాలల్లో సిల్వర్‌జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. –సాక్షి, హైదరాబాద్ అత్యున్నత నైపుణ్యం, నైతిక విలువలతో కూడిన విద్య, సంస్కారమే లక్ష్యంగా పురుడు పోసుకున్న ఓక్రిడ్జ్ విద్యా సంస్థలు వేలాది మంది విద్యార్థులను సమాజ హితులుగా తీర్చిదిద్ది అప్పుడే సిల్వర్‌జూబ్లీ వేడుకలకు చేరువయ్యాయి. విశాఖలో వికాస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్గా మొగ్గతొడిగి నేడు ఓక్రిడ్జ్ అంతర్జాతీయ పాఠశాలగా అవతరించి ‘స్కిల్స్, వాల్యూస్, హ్యాబిట్స్’అనే నినాదంతో వేలాది మంది ఉత్తమ విద్యార్థులను సమాజానికి అందిస్తోంది. తమ పిల్లలకు మార్కులు వస్తే చాలనుకుంటున్న తల్లిదండ్రుల ఆలోచనలను మారుస్తూ.. నైపుణ్యం, సమయానికి ఆహారపు అలవాట్లు, నియమాలు పాటిస్తే ‘ఫర్ఫెక్ట్ స్టూడెంట్’గా మారతారని చేతల్లో చూపిస్తున్నారు నూజివీడుకు చెందిన తుమ్మల నాగప్రసాద్, యార్లగడ్డ రాజశేఖర్‌బాబు. వీరిద్దరూ రెండో తరగతి నుంచి నూజివీడు జెడ్పీ హైస్కూల్లో కలసి చదువుకున్నారు. ధర్మా అప్పారావు కాలేజీలో ఇంటర్ చదివారు. నాగప్రసాద్ డీఏఆర్ కాలేజీలో బీఎస్సీ, సాగర్ యూనివర్సిటీలో ఎంఎస్సీ పూర్తి చేశారు. రాజశేఖర్ భీమవరంలో సివిల్ ఇంజనీరింగ్ చదివారు. 1993లో ఇద్దరూ కలసి వైజాగ్‌లో వికాస్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్ నెలకొల్పారు. ఐఐటీ, ఎంసెట్, మెడిసిన్‌లో శిక్షణ ఇచ్చేవారు. జాయ్‌ఫుల్ లెర్నింగ్ కోసం దేశవిదేశాల్లోని 100కుపైగా పాఠశాలల్లో రీసెర్చ్ చేశారు. డెహ్రాడూన్‌లోని డూన్ పాఠశాలకు వెళ్లి పదవీ విరమణ పొందిన షౌమీరంజన్దాస్ను కలిశారు. ఆయనిచ్చిన సలహాలు, మానసికస్థైర్యంతో ఇంటర్నేషనల్ బ్యాకులరేట్(ఐబీ) సిలబస్‌తో ఓక్రిడ్జ్ అంతర్జాతీయ పాఠశాల పెట్టాలనే ఆలోచన వచ్చింది. అదే స్ఫూర్తిగా హైదరాబాద్‌లో.. 2001 జూన్ 11న జూబ్లీహిల్స్‌లో ఓక్రిడ్జ్ స్కూల్ ప్రారంభమైంది. ప్రశాంత వాతావరణం ఉండేలా ఖాజాగూడలోని 10.5 ఎకరాల్లో మొదటి ఐబీ స్కూల్ కొత్త క్యాంపస్‌ను నిర్మించి దానికి న్యూటన్ క్యాంపస్‌గా నామకరణం చేసి అక్కడికి మార్చారు. దేశవ్యాప్తంగా ఉన్న ఐదు క్యాంపస్‌ల్లో ఇదే అతి పెద్దది. బాచుపల్లిలో ఐన్‌స్టీన్ క్యాంపస్, బెంగళూరు, విశాఖపట్నం, మొహలీలో ఇతర క్యాంపస్‌లు ఉన్నాయి. ‘ఖాజాగూడలోని న్యూటన్ క్యాంపస్‌లో ఐబీ సిలబస్‌ను మూడు రకాలుగా అందుబాటులో ఉంచాం. బాచుపల్లిలో కేంబ్రిడ్జి ప్రోగ్రామ్, కేంబ్రిడ్జి ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్, కేంబ్రిడ్జి ఇంటర్నేషనల్ ప్రైమరీ ఇయర్ ప్రోగ్రామ్, ఇంటర్నేషనల్ గ్రేడ్ సర్టిఫికెట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వంటి సిలబస్‌లతో విద్యార్థులను అన్నింట్లో ఆరితేరేలా చూస్తున్నాం. ఇవే కాకుండా హైదరాబాద్‌లో 25, బెంగళూరులో 20 ఓపెన్ ఇంటరాక్షన్ ప్లేస్కూల్స్‌ను ఫ్రాంచైజీల సహకారంతో నిర్వహిస్తూ పసిప్రాయంలోనే పిల్లలను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతున్నాం’అని నాగప్రసాద్, రాజశేఖర్ తెలిపారు. పీర్ లెర్నింగ్‌తో ఆలోచనల వెల్లువ.. ఓక్రిడ్జ్ అంతర్జాతీయ పాఠశాలలో లెటర్ మోడ్‌లో కాకుండా ఐల్యాండ్ మోడ్(పీర్ లెర్నింగ్)లో విద్యార్థులు గుంపులు గుంపులుగా కూర్చుని.. తమ ఆలోచనలను పంచుకుంటారు. చర్చా కార్యక్రమాలు, వ్యాస రచనలు, క్విజ్ నిర్వహిస్తారు. విద్యార్థుల ఆలోచనలకు అద్దంపట్టేలా పర్సనల్ ప్రాజెక్టుల పేరిట పరిశోధనలను ప్రోత్సహిస్తారు. ప్రతి 25 మందికి ఒక టీచర్, లోయర్ గ్రేడ్‌లో పది మందికి ఒక టీచర్ ఉంటారు. విద్యార్థుల్లో సేవా దృక్ఫథాన్ని అలవర్చేందుకు ఐబీ కరికులమ్‌లో భాగంగా కమ్యూనిటీ యాక్షన్ సర్వీస్(క్యాస్) కార్యక్రమం ప్రారంభించారు. దీనిద్వారా విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, స్వచ్ఛ భారత్, వృద్ధాశ్రమాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించడం, అనాథ పిల్లల సంరక్షణ కేంద్రాలను పరిశీలించి చేయూత అందించడం వంటి కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తున్నారు. అవార్డుల వెల్లువ - 2018లో ఫోర్బ్స్ మేగజీన్ సర్వేలో గ్రేట్ ఇండియన్ స్కూల్‌గా ఓక్రిడ్జ్ అంతర్జాతీయ పాఠశాలకు గుర్తింపు. - తెలంగాణ రాష్ట్రంలో పీపుల్ కంబైన్ గ్రూప్‌నకు బెస్ట్ ఎంప్లాయర్ బ్రాండ్–2017 అవార్డు పొందింది. - ఎడ్యుకేషన్ టుడే సర్వేలో వరుసగా మూడేళ్లపాటు టాప్ ర్యాంక్ ఇన్ ఇండియన్ స్కూల్ మెరిట్ అవార్డు - 2017లో టైమ్స్ సర్వేలో ఇంటర్నేషనల్ స్కూళ్లలో న్యూటన్ క్యాంపస్‌కు మొదటిస్థానం. 2016లో టైమ్స్ సర్వేలో నంబర్ వన్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇన్ ఇండియాగా ఓక్రిడ్జ్‌కు గుర్తింపు. - 2015లో దేశంలోనే టాప్ టెన్ స్కూల్స్‌లో ఒకటిగా ఎడ్యుకేషన్ వరల్డ్ మేగజైన్ గుర్తింపు ళి 2015 టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వేలో బెస్ట్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్‌గా నిలిచింది. క్రీడల్లోనూ మెరిసేలా.. క్రీడల్లోనూ విద్యార్థులు రాణించేలా.. అన్ని క్యాంపస్‌ల్లో క్రీడల మౌలిక వసతులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఒక్క న్యూటన్ క్యాంపస్‌లోనే అంతర్జాతీయ ప్రమాణాలతో టెన్నిస్ కోర్టులు, స్విమ్మింగ్‌పూల్, స్క్వాష్పూల్, క్రికెట్ పిచ్, వాలీబాల్ కోర్టు, బాస్కెట్‌బాల్ కోర్టు, సాకర్ ఫీల్డ్, రాక్ క్లైంబింగ్, స్కేటింగ్ రింక్ వంటివి అందుబాటులోకి తీసుకొచ్చారు. సుశిక్షితులైన స్పోర్ట్ కోఆర్డినేటర్ çపర్యవేక్షణలో కోచ్‌లను నియమించి శిక్షణ ఇస్తున్నారు. దీంతో దేశవిదేశీ క్రీడా పోటీల్లో ఓక్రిడ్జ్ విద్యార్థులు అనేక పతకాలు సాధించారు. ప్రశ్న తలెత్తితేనే జవాబు దొరుకుతుంది.. కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలనే ఓక్రిడ్జ్ స్కూల్స్ స్థాపించాం. విద్యార్థుల మెదడులో ఒక ప్రశ్న తలెత్తితేనే జవాబు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తారు. ప్రశ్నే తలెత్తకపోతే ఆ విద్యార్థి« సరైన మార్గంలో వెళ్లడం కష్టం. బట్టీ విధాçనంతో శిక్షణ లోపిస్తుంది. ఈ విధానానికి స్వస్తి చెప్పేందుకే ఓక్రిడ్జ్ అంతర్జాతీయ పాఠశాల ప్రారంభించాం. భవిష్యత్తుకు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించేలా బోధన చేపడుతున్నాం. – తుమ్మల నాగప్రసాద్(చైర్మన్, పీపుల్ కంబైన్), యార్లగడ్డ రాజశేఖర్‌బాబు (మేనేజింగ్ డైరెక్టర్, పీపుల్ కంబైన్) -
‘ట్రెజర్ ఫెస్ట్’ అదుర్స్
-
వైజ్ఞానిక ప్రదర్శన అదుర్స్..
-
ఓక్రిడ్జ్ స్కూల్‌కు ‘డబుల్'
ఎల్బీ స్టేడియం: ఐఎంజీ-రిలయన్స్ స్కూల్స్ బాస్కెట్‌బాల్ లీగ్ టోర్నమెంట్లో బాలబాలికల టైటిళ్లను ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ జట్లు చేజిక్కించుకున్నాయి. ఈ రెండు విభాగాల్లో చిరెక్ స్కూల్ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. బేగంపేట్‌లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (హెచ్‌పీఎస్) బాస్కెట్‌బాల్ మైదానంలో మంగళవారం జరిగిన బాలుర ఫైనల్లో ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ జట్టు 42-21 పాయింట్ల తేడాతో చిరెక్ పబ్లిక్ స్కూల్ జట్టుపై ఘనవిజయం సాధించింది. ఓక్రిడ్జ్ స్కూల్ జట్టులో హర్ష 13, నీల్ 13, రావల్ 11 పాయింట్లు చేశారు. చిరెక్ పబ్లిక్ స్కూల్ జట్టులో సంజయ్ 11 పాయింట్లు చేశాడు. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ జట్టు 54-40తో గీతాంజలి స్కూల్ జట్టుపై గెలిచింది. బాలికల ఫైనల్లో ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ జట్టు 37-31 పాయింట్ల తేడాతో చిరెక్ పబ్లిక్ స్కూల్ జట్టుపై గెలిచింది. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ జట్టు 66-51తో ఫ్యూచర్ కిడ్స్ స్కూల్‌పై నెగ్గింది. -
మ్యాథ్స్‌లో వరల్డ్ టాపర్ హైదరాబాదీ
హైదరాబాద్: హైదరాబాదీ బాలుడు రిషికేశ్‌రెడ్డి కాయతి అద్భుతం సాధించాడు. నగరంలోని ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఐన్‌స్టీన్ క్యాంపస్ విద్యార్థి అయిన ఈ బాలుడు మాథ్స్‌లో వరల్డ్ టాపర్‌గా నిలిచాడు. ఇంటర్నేషనల్ జనరల్ సర్టిఫికెట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (ఐజీసీఎస్ఈ) మే నెలలో నిర్వహించిన పదో తరగతి మ్యాథ్స్‌లో రిషికేశ్‌రెడ్డి వందశాతం మార్కులు సాధించాడు. తమ ఉపాధ్యాయుల కృషితో పాటు అంకితభావంతో చదవడం వల్ల రిషికేశ్‌రెడ్డి ఈ ఘనవిజయాన్ని సొంతం చేసుకోగలిగాడని ప్రిన్సిపాల్ జ్యోతిరెడ్డి, స్కూల్ డెరైక్టర్ మానస్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. -
ఓక్రిడ్జ్ స్కూల్ ‘డబుల్’
ఇంటర్ స్కూల్ బాస్కెట్‌బాల్ రాయదుర్గం: ఇంటర్ స్కూల్ ఇన్విటేషన్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్లో ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ సత్తా చాటింది. ఈ స్కూల్‌కు చెందిన బాల, బాలికల జట్లు విజేతలుగా నిలిచాయి. చిరెక్ పబ్లిక్ స్కూల్ జట్టు రెండు విభాగాల్లోనూ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. శుక్రవారం గచ్చిబౌలి డివిజన్ ఖాజాగూడలోని ఓక్రిడ్జ్ స్కూల్లో ఈ పోటీల ఫైనల్ మ్యాచ్‌లు జరిగాయి. బాలుర ఫైనల్లో ఓక్రిడ్జ్ 49-32 తేడాతో చిరెక్ పబ్లిక్ స్కూల్‌ను చిత్తు చేసింది. హోరాహోరీగా సాగిన బాలికల ఫైనల్లో ఓక్రిడ్జ్ 46-42 స్కోరుతో చిరెక్పై విజయం సాధించింది. విజేతలకు ఓక్రిడ్జ్ స్కూల్ వైస్ ప్రిన్సిపల్ హేమా సంజయ్, బిజుబేబిలు ట్రోఫీలు, సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ స్పోర్ట్స్ కో ఆర్డినేటర్ డేవిడ్ రాజ్‌కుమార్, కోచ్‌లు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఓక్రిడ్జ్‌లో ముగిసిన అర్సెనల్ సాకర్ క్యాంప్
రాయదుర్గం, న్యూస్‌లైన్: ఖాజాగూడలోని ఓక్రిడ్జ్ అంతర్జాతీయ పాఠశాలలో నిర్వహించిన అర్సెనల్ సాకర్ కోచింగ్ క్యాంప్ మంగళవారం ముగిసింది. 6 నుంచి 16 ఏళ్ళలోపు విద్యార్థులకు ఈ శిబిరంలో శిక్షణ ఇచ్చారు. వారం రోజుల పాటు జరిగిన ఈ క్యాంపులో 78 మంది విద్యార్థులు ఫుట్‌బాల్ నేర్చుకున్నారు. ఇందులో ఆరుగురు విద్యార్థినిలు కూడా ఉన్నారు. మంగళవారం జరిగిన ముగింపు కార్యక్రమంలో అర్సెనల్ క్లబ్‌కు చెందిన కోచ్ జువాన్ జోన్స్ మాట్లాడుతూ ఫుట్‌బాల్‌కు భారత్‌లో ప్రాచుర్యం కల్పించేందుకు ఈ తరహా శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విడతల వారిగా మిగతా నగరాల్లో శిక్షణ శిబిరాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓక్రిడ్జ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ హెడ్ డేవిడ్ రాజ్‌కుమార్, ఫుట్‌బాల్ కోచ్‌లు దినేష్, రాము, అల్తిమస్.. ఓక్రిడ్జ్, డీపీఎస్, అజ్మీర్‌కు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. తిరిగి ఈనెల 8వ తేదీ నుంచి 13వ తేదీ వరకు బాచుపల్లిలోని ఓక్రిడ్జ్ అంతర్జాతీయ పాఠశాలలో రెండో విడత శిక్షణ కార్యక్రమం జరగనుంది. -
క్రికెట్ టోర్నీ ఫైనల్లో ఓక్రిడ్జ్
రాయదుర్గం, న్యూస్‌లైన్ : మెరీడియన్ సంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అండర్-12 క్రికెట్ టోర్నీలో ఓక్రిడ్జ్ అంతర్జాతీయ స్కూల్ (ఖాజాగూడ) జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన సెమీఫైనల్లో ఓక్రిడ్జ్ జట్టు... మెరీడియన్ బంజారా జట్టుతో తలపడింది. 10 ఓవర్ల ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన మెరీడియన్ బంజారా జట్టు 78 పరుగులు చేసింది. ఓక్రిడ్జ్ జట్టు బౌలర్ రోహన్ 13 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఓక్రిడ్జ్ జట్టు 9.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఓక్రిడ్జ్ జట్టులో క్రితిక్ 29 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. జట్టు విజయానికి దోహదపడ్డాడు. ఫైనల్ పోరు శుక్రవారం జరుగుతుంది. -
చాంప్స్ ఓక్రిడ్జ్, చిరెక్
జింఖానా, న్యూస్‌లైన్: భారత బాస్కెట్‌బాల్ సమాఖ్య (బీఎఫ్ఐ) ఐఎంజీ రిలయన్స్ స్కూల్ బాస్కెట్‌బాల్ లీగ్‌లో బాలుర విభాగంలో ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్... బాలికల విభాగంలో చిరెక్ పబ్లిక్ స్కూల్ చాంపియన్స్‌గా నిలిచాయి. వైఎంసీఏలో జరిగిన బాలుర ఫైనల్స్‌లో ఓక్రిడ్జ్ 54-25తో గీతాంజలి స్కూల్‌పై విజయం సాధించింది. మ్యాచ్ తొలి అర్ధ భాగం ముగిసే సమయానికి ఓక్రిడ్జ్ 28-14తో ముందంజలో నిలిచింది. ముందు నుంచి దూకుడుగా ఆడుతున్న కార్తీక్ (17), సునీత్ (13), విభు (8) తర్వాత కూడా అదే రీతిలో చెలరేగడంతో ఆ జట్టుకు గెలుపు దక్కింది. గీతాంజలి స్కూల్ జట్టులో సహర్ష్ (11), ఒమర్ (10) రాణించారు. బాలికల విభాగం ఫైనల్స్‌లో చిరెక్ పబ్లిక్ స్కూల్ 44-19తో సెయింట్ పాయిస్ హైస్కూల్‌పై నెగ్గి టైటిల్ కైవసం చేసుకుంది. మొదటి అర్ధ భాగం ముగిసే సమయానికి చిరెక్ 28-8తో ఆధిక్యంలో ఉంది. దృష్టి (16), సబ్రీన్ (8), సంహిత (6) అలవోకగా దూసుకెళ్ళి జట్టుకు విజయాన్ని అందించారు. సెయింట్ పాయిస్ క్రీడాకారిణిలు మౌనిక (9), తేజస్విని (8) చక్కని ఆటతీరు కనబరిచారు. బాలుర విభాగంలో మూడు, నాలుగు స్థానాల కోసం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ 50-36తో చిరెక్ పబ్లిక్ స్కూల్‌పై నెగ్గగా.. బాలికల విభాగంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ 39-30తో ఫ్యూచర్ కిడ్స్ జట్టును ఓడించింది. బాలుర విభాగంలో కార్తీక్ (ఓక్రిడ్జ్), బాలికల విభాగంలో దృష్టి (చిరెక్) ‘ఉత్తమ క్రీడాకారులు’గా ఎంపికయ్యారు. బీఎఫ్ఐ సాంకేతిక కమిటీ చైర్మన్ జీఎం సంపత్ కుమార్ ముఖ్యఅతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలు అందజేశారు. విజేత జట్లకు రూ. 50 వేల చొప్పున నగదు పురస్కారం దక్కింది. రన్నరప్ జట్లకు రూ. 30 వేల చొప్పున... మూడో స్థానం పొందిన జట్లకు రూ. 20 వేల చొప్పున ఇచ్చారు. -
ఓక్రిడ్జ్ శుభారంభం
రాయదుర్గం, న్యూస్‌లైన్: అంతర్ పాఠశాలల సెవన్ ఏ సైడ్ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో ఓక్రిడ్జ్ అంతర్జాతీయ పాఠశాల శుభారంభం చేసింది. ఖాజాగూడలోని ఓక్రిడ్జ్ అంతర్జాతీయ పాఠశాలలో గురువారం ప్రారంభమైన ఈ టోర్నీలో జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ జట్టును 4-2 స్కోరుతో ఓడించింది. కెన్నడీ గ్లోబల్స్కూల్ జట్టు 5-1 స్కోరుతో ఆగాఖాన్ అకాడమీ జట్టును ఓడించింది. శనివారం ఫైనల్ పోటీలను నిర్వహిస్తారు. నగరంలోని 14 పాఠశాలలకు చెందిన ఫుట్‌బాల్ జట్లు ఈ పోటీల్లో పాల్గొంటున్నాయి. ఈ పోటీలను మాజీ జాతీయ ఫుట్‌బాల్ క్రీడాకారుడు మహ్మద్ హబీబ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల వైస్ ప్రిన్సిపల్ బిజుబేబి, పీపుల్స్ కంబైన్ ప్రతినిధి రాజన్, పాఠశాల స్పోర్ట్స్ కోఆర్డినేటర్ మార్టిన్, కోచ్‌లు, వివిధ జట్ల క్రీడాకారులు పాల్గొన్నారు. -
స్విమ్మింగ్ ఓవరాల్ చాంప్ ఓక్రిడ్జ్
రాయదుర్గం, న్యూస్‌లైన్: అంతర్ పాఠశాలల జూనియర్, సీనియర్ ఆక్వాటిక్ మీట్లో ఓక్రిడ్జ్ అంతర్జాతీయ స్కూల్ (ఖాజాగూడ) సత్తాచాటింది. గ్లెన్డేల్ అకాడమీలో శనివారం నిర్వహించిన స్విమ్మింగ్ పోటీల్లో ఓక్రిడ్జ్ బృందం ఓవరాల్ చాంపియన్‌షిప్ సాధించింది. ఈ పోటీల్లో 14 పాఠశాలల జట్లు పాల్గొన్నాయి. ఇందులో ఓక్రిడ్జ్ పాఠశాల విద్యార్థులు జూనియర్, సీనియర్ విభాగాల్లో ఏడు బంగారు పతకాలు, ఐదు రజతాలు, మూడు కాంస్య పతకాలు గెలుపొందారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ కెప్టెన్ రోహిత్ సేన్ బజాజ్ విజేతలుగా నిలిచిన విద్యార్థులను, కోచ్‌లను అభినందించారు.