క్రికెట్ టోర్నీ ఫైనల్లో ఓక్రిడ్జ్ | In cricket tournment final Oakridge team | Sakshi
Sakshi News home page

క్రికెట్ టోర్నీ ఫైనల్లో ఓక్రిడ్జ్

Published Fri, Jan 31 2014 12:31 AM | Last Updated on Sat, Sep 2 2017 3:11 AM

In cricket tournment final Oakridge team

రాయదుర్గం, న్యూస్‌లైన్ : మెరీడియన్ సంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అండర్-12 క్రికెట్ టోర్నీలో ఓక్రిడ్జ్ అంతర్జాతీయ స్కూల్ (ఖాజాగూడ) జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన సెమీఫైనల్లో ఓక్రిడ్జ్ జట్టు... మెరీడియన్ బంజారా జట్టుతో తలపడింది.
 
  10 ఓవర్ల ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన మెరీడియన్ బంజారా జట్టు 78 పరుగులు చేసింది. ఓక్రిడ్జ్ జట్టు బౌలర్ రోహన్ 13 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఓక్రిడ్జ్ జట్టు 9.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఓక్రిడ్జ్ జట్టులో క్రితిక్ 29 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. జట్టు విజయానికి దోహదపడ్డాడు. ఫైనల్ పోరు శుక్రవారం జరుగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement