ఓక్రిడ్జ్ స్కూల్ ‘డబుల్’
ఇంటర్ స్కూల్ బాస్కెట్‌బాల్
రాయదుర్గం: ఇంటర్ స్కూల్ ఇన్విటేషన్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్‌లో ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ సత్తా చాటింది. ఈ స్కూల్‌కు చెందిన బాల, బాలికల జట్లు విజేతలుగా నిలిచాయి. చిరెక్ పబ్లిక్ స్కూల్ జట్టు రెండు విభాగాల్లోనూ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. శుక్రవారం గచ్చిబౌలి డివిజన్ ఖాజాగూడలోని ఓక్రిడ్జ్ స్కూల్‌లో ఈ పోటీల ఫైనల్ మ్యాచ్‌లు జరిగాయి.
బాలుర ఫైనల్లో ఓక్రిడ్జ్ 49-32 తేడాతో చిరెక్ పబ్లిక్ స్కూల్‌ను చిత్తు చేసింది. హోరాహోరీగా సాగిన బాలికల ఫైనల్లో ఓక్రిడ్జ్ 46-42 స్కోరుతో చిరెక్‌పై విజయం సాధించింది. విజేతలకు ఓక్రిడ్జ్ స్కూల్ వైస్ ప్రిన్సిపల్ హేమా సంజయ్, బిజుబేబిలు ట్రోఫీలు, సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ స్పోర్ట్స్ కో ఆర్డినేటర్ డేవిడ్ రాజ్‌కుమార్, కోచ్‌లు, విద్యార్థులు పాల్గొన్నారు.