‘లెక్క’ తప్పింది!
మ్యాథ్స్‌లో అత్యధికంగా 51,121 మంది ఫెయిల్
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్షల్లో గణితం సబ్జెక్టు ఈసారి కూడా విద్యార్థులకు ఇబ్బందిగా మారింది. గ తేడాదిలాగే ఈసారి గణితంలోనే అధిక సంఖ్యలో విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. మ్యాథ్స్ తర్వాత సైన్స్, ఇంగ్లిష్ సబ్జెక్టుల్లో ఎక్కువ మంది ఫెయిల్ అయ్యారు. గణితంలో 51,121 మంది ఫెయిల్ కాగా.. సైన్స్‌లో 23,821 మంది, ఇంగ్లిష్‌లో 9,623 మంది ఫెయిల్ అయ్యారు.
అయితే గతేడాదితో పోలిస్తే మాత్రం అన్ని సబ్జెక్టుల్లోనూ ఉత్తీర్ణత శాతం పెరిగింది. గతేడాది ప్రథమ భాషలో 95.43 శాతం మంది ఉత్తీర్ణులు కాగా ద్వితీయ భాషలో 99.31 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఇంగ్లిష్‌లో 97.53 శాతం మంది ఉత్తీర్ణులు కాగా గణితంలో 82.59 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. సామాన్య శాస్త్రంలో 89.72 శాతం మంది ఉత్తీర్ణులు కాగా.. సాంఘిక శాస్త్రంలో 97.80 శాతం మంది ఉత్తీర్ణులు అయ్యారు.